Home » చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాకు నో చెప్పిన సౌంద‌ర్య‌.. ఎందుకో తెలుసా..?

చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాకు నో చెప్పిన సౌంద‌ర్య‌.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య న‌టించిన చెన్న‌కేశవ‌రెడ్డి సినిమాలో న‌టించేందుకు సీనియ‌ర్ న‌టి సౌంద‌ర్య ఒప్పుకోలేద‌ట‌. అప్ప‌ట్లో ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. వివివినాయ‌క్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చెన్న‌కేశవ‌రెడ్డి భారీ అంచ‌నాల మ‌ధ్య విడుదల అయింది. ద‌ర్శ‌కుడు అప్ప‌ట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా ఆంధ్ర రాష్ట్రాన్ని ఊపేసింది. ఆ స‌మ‌యంలో ఆగ‌మేఘాల మీద చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాను ఇంద్ర సినిమాకు పోటీగా విడుద‌ల చేశార‌ని టాక్ వినిపించింది. అప్ప‌టికే వినాయ‌క్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఆది సినిమా తెర‌కెక్కించి సూప‌ర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ త‌రువాత బాల‌కృష్ణ‌తో చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాను తెర‌కెక్కించారు.


ఇక ఈ సినిమాను ఆగ‌మేఘాల మీద తెర‌కెక్కించ‌డంతో స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్ట‌కుండా విడుద‌ల చేయ‌డంతో చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా అంచ‌నాల‌కు కాస్త దూరంలో నిలిచింది. సినిమా బాగుంద‌న్నా టాక్ వినిపించిన‌ప్ప‌టికీ.. ఇంద్ర సినిమాతో పోల్చితే చెన్న‌కేశ‌వ‌రెడ్డి సూప‌ర్ హిట్ టాక్ అందుకోలేదు. కేవ‌లం 42 కేంద్రాల్లోనే బాల‌య్య సినిమా 100 రోజులు ఆడింది. చెన్న‌కేశ‌వ‌రెడ్డి బాల‌య్య‌కు జంట‌గా ట‌బు, శ్రియ న‌టించిన విష‌యం విధిత‌మే. తండ్రి పాత్ర‌లో న‌టించిన బాల‌కృష్ణ‌కు జోడిగా ముందుగా సౌంద‌ర్య‌ను సంప్ర‌దించ‌గా స్టోరీ విన్న త‌రువాత ఆమె రిజెక్ట్ చేసింద‌ట‌. సౌంద‌ర్య హీరోయిన్ గా చేసిన ఐదారు సినిమాల‌కు వినాయ‌క్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశార‌ట‌.

Advertisement

Advertisement


ఆ ప‌రిచ‌యంతోనే ఆయ‌న బెంగ‌ళూరు వెళ్లి సౌంద‌ర్య‌కి క‌థ చెప్ప‌గా ఆమె త‌ల్లి పాత్ర చేసేందుకు సౌంద‌ర్య ఒప్పుకోలేద‌ట‌. కెరీర్ మంచి ద‌శ‌లో ఉన్న‌ప్పుడు త‌ల్లి పాత్ర‌లు చేస్తే ఆ త‌రువాత కూడా అదే త‌ర‌హా పాత్ర‌లు వ‌స్తాయ‌ని అందుకే బాల‌య్యతో క‌లిసి న‌టించేందుకు సౌంద‌ర్య నో చెప్పింద‌ట‌. ఇక ఆ త‌రువాత ద‌ర్శ‌కుడు వినాయ‌క్ ఇదే స్టోరీని బాలీవుడ్ హీరోయిన్ ట‌బుకు చెప్పగానే ఆమె ఓ చెప్పేసింద‌ట‌. అలా తండ్రి పాత్ర‌కు ఓడీగా ట‌బును తీసుకున్నారు. ఆ త‌రువాత కొడుకు పాత్ర‌కు బాల‌య్య‌కు జంట‌కు అప్ప‌ట్లో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న శ్రీయ‌ను ఎంపిక చేశారట వినాయ‌క్‌. కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే సినిమా పూర్తి చేసి విడుద‌ల చేయ‌డంతో ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడ‌క‌పోయినప్ప‌టికీ బాల‌య్య కెరీర్‌లో ఓ మంచి సినిమాగానే గుర్తింపు సంపాదించుకోవ‌డం విశేషం.

Also Read : 

తండ్రుల బాటలో నడిచి స్టార్ హీరోలు గా సక్సెస్ అయిన 5 గురు హీరోలు వీళ్లే…!

నాగ‌చైత‌న్య ఆ సినిమాకు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

Visitors Are Also Reading