తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో ఏ విధంగా హైలెట్ అవుతారో విలన్ కూడా ఆ విధంగానే మంచి గుర్తింపు సాధిస్తారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది సోనుసూద్ మాత్రమే. ఆయన సినిమాల్లో మాత్రమే విలన్ గా ఉంటారు కానీ నిజ జీవితంలో చాలా మంచి మనిషి. ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ రాతలు సరిపోవు. అంతటి గొప్ప క్యారెక్టర్ ఉన్న నటుడు సోను సూద్. చెయ్ చాచి అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఆపన్న హస్తము అందించారు. అలాంటి సోనుసూద్ దేశవ్యాప్తంగా నటుడిగానే కాకుండా ఒక మంచి సహకారిగా గుర్తింపు సాధించారు.
Advertisement
Also Read:వైజయంతీ బ్యానర్ లోగో కు అన్నగారి ఫోటో ఎందుకు ఉంటుంది..? దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి..?
అలాంటి ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సహాయ సహకారాలు అందించారు . ఈ తరుణంలో సొనూసూద్ రాజకీయాల్లోకి కూడా వస్తున్నట్టు అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దామా.. తెలుగు, తమిళ,కన్నడ చిత్రాలలో విలన్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు సాధించారు సోనూసూద్. 2009లో అరుంధతి సినిమాలో నటించి ఉత్తమ విలన్ గా నంది అవార్డును కూడా అందుకున్నారు. అంతేకాదు సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత జులాయి లో నటించి సైమా అవార్డు కూడా అందుకున్నాడు. అలాంటి సోను సూద్ 1973 జూలై 30 న జన్మించాడు. 2016 జూలైలో శక్తి సాగర్ ప్రొడక్షన్ స్థాపించారు. దీనికి తన తండ్రి శక్తి సాగర్ సూద్ పేరు పెట్టారు.
Advertisement
Also Read:తాప్సీ అవకాశాల కోసం ఆ స్టార్ హీరోతో అలాంటి పని చేసిందా..?
సెప్టెంబర్ 2020 కోవిడ్ 19 మహమ్మారి టైంలో ఆయన చేసిన సహాయ సహకారాలు మాటల్లో చెప్పలేం. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. మహమ్మారి సమయంలో అతను మానవతవాద పనులకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా సూద్ ను SDG స్పెషల్ హోమానిటేరియన్ యాక్షన్ అవార్డు అందుకున్నారు. అలాంటి సోను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సహాయ సహకారాలు అందించారు. ఎంతో గుర్తింపు సాధించారు. అలాంటి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. అది కూడా సొంతంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా సహానటుడైన పవన్ కళ్యాణ్ తో పొత్తు కుదుర్చుకొని ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది .
Also Read:కొత్తకార్ ప్రయాణం యమడేంజర్! షాకింగ్ నిజాలు!!