Home » రెండోపెళ్లికి రెడీ అవుతున్న 7/జి హీరోయిన్..మ‌ళ్లీ ద‌ర్శ‌కుడితోనే..?

రెండోపెళ్లికి రెడీ అవుతున్న 7/జి హీరోయిన్..మ‌ళ్లీ ద‌ర్శ‌కుడితోనే..?

by AJAY
Ad

టాలీవుడ్ లో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమాల్లో 7జి బృందావన కాలనీ కూడా ఒకటి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఉండే సన్నివేశాలు ఎంతగానో అలరించాయి. దాంతో ఈ సినిమా లో హీరో తో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో పాపులారిటీ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ కు ఇదే మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమానే సోనియా అగర్వాల్ ఆ త‌ర‌వాత‌ తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయ్యింది.

sonia agarawal again in love with

sonia agarawal again in love with

కానీ ఈ ముద్దుగుమ్మ త్వరగానే తన సినిమా కెరీర్ కు గుడ్బై చెప్పింది. ఆ తర్వాత త‌న‌ను సిల్వ‌ర్ స్క్రీన్ కు ప‌రిచ‌యం చేసిన 7జి బృందావన కాలనీ దర్శకుడు సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్తా 2006లో పెళ్లి పీటలు ఎక్కింది. అయితే వీరి పెళ్లి జీవితం ఊహించినట్టుగా లేకపోవడంతో ఇద్దరూ నాలుగేళ్ల‌కే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సోనియా సినిమాల వైపు మళ్ళింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరిస్తోంది.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉంటే సోనియా అగర్వాల్ మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దర్శకుడు సెల్వ రాఘవన్ తో ప్రేమ పెళ్లి పెటాకులు అయిన కూడా మ‌రో దర్శకుడితో ప్రేమలో పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ జంట త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంద‌ని కూడా వార్తలు చెక్క‌ర్లు కొడుతున్నాయి. అయితే గ‌తంలోనూ ఇలాంటి వార్త‌లు ఎన్నో వ‌చ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే సోనియా నోరు విప్పాల్సిందే.

also read : సాయితేజ కుటుంబానికి అండ‌గా మంచువిష్ణు..ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఫ్రీ ఎడ్యుకేష‌న్..!

Visitors Are Also Reading