Home » ఉక్రెయిన్ గురించి ప్రపంచానికి కూడా తెలియని కొన్ని నిజాలు.. ఏంటో చూడండి..!!

ఉక్రెయిన్ గురించి ప్రపంచానికి కూడా తెలియని కొన్ని నిజాలు.. ఏంటో చూడండి..!!

by Sravanthi
Ad

ఉక్రెయిన్ భూతల స్వర్గాన్ని తలపించే దేశం.చారిత్రక ప్రదేశాలు ప్రాచీన కట్టడాలకు నిలువైన ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా ఎటాక్ తో కకావికలం అవుతోంది. యుద్ధానికి ముందు ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా జీవించేవారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఉక్రెయిన్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను ఇప్పుడు తెలుస్తుంది. ఉక్రెయిన్ ఎంతో అందమైన దేశం. సినిమా షూటింగ్ లకు స్వర్గధామం ఈ సిటీ. ఉక్రెయిన్ జనాభా నాలుగు కోట్ల 38 లక్షలు. ప్రపంచం లోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో 35 వ స్థానంలో ఉంది. ఉక్రెయిన్ ను బ్రేడ్ బాస్కెట్ కంపెనీ గా పిలిచేవారు. ఇక్కడ బ్రెడ్ చాలా బాగుంటుంది. ప్రపంచంలోనే అత్యధిక ధాన్యం ఎగుమతిలో కూడా ఈ దేశం అగ్రస్థానంలోనే ఉంది.

Advertisement

ఉక్రెయిన్ వైవిధ్యభరితమైన అంతరిక్ష,పారిశ్రామిక పరికరాల తయారీకి సంబంధించి భారీ పరిశ్రమలు కలిగి వుంది. ఉక్రెయిన్ అంటే సరిహద్దు ప్రాంతం అని అర్థం. ఉక్రెయిన్ లు వివాహానికి పెట్టే ఉంగరాలను ఎడమ చేతికి కాకుండా కుడి చేతికి ధరిస్తారు. ఇక్కడ చికెన్, పంది మాంసం, గొడ్డు మాంసం, చేపలు, పుట్టగొడుగులు ఎక్కువగా తింటారు. ప్రపంచంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ ఈ దేశం లోనే ఉంది. ఈ స్టేషన్ ని భూమికి 345అడుగుల లోతుల్లో నిర్మించారు. ఈ దేశంలో ప్రతి 100 మంది మహిళల్లో 86 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. యూరప్ దేశాలలో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశంగా ఉక్రెయిన్ 8వ స్థానంలో ఉంది. చదువు, ఉపాధి

Advertisement

కోసమే కాదు షూటింగ్ ల కోసం కూడా భారతీయ చిత్ర పరిశ్రమలు, మరీ ముఖ్యంగా తెలుగు చిత్రసీమ తరచూ వెళ్లే ప్రదేశం ఉక్రెయిన్. పెద్ద పెద్ద మైదానాలు, బీచ్ లు,పోర్ట్ లు ఉన్నాయి.ఒకపక్క సహజమైన ప్రకృతి, అందాలు ఆధునిక సొగసులతో అలరారుతుండే ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా సైనిక దాడులతో కల తప్పింది. పింక్ రంగులో కనిపించే సరస్సు ఉక్రెయిన్ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. టన్నెల్ ఆఫ్ లవ్. ఇక్కడ రెండు వైపులా చెట్లతో అల్లుకున్నట్లు సొరంగంల ఉంటుంది. ఇది చాలా సినిమాల్లో కూడా కనిపిస్తుంది.

ALSO READ;

సరికొత్త చిరంజీవిని చూస్తారు…అంచనాలు పెంచేస్తున్న మెహర్ రమేష్ …!

సబ్జాగింజలు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి లేదంటే ప్రమాదమే..!!

 

Visitors Are Also Reading