Home » రాధేశ్యాం నుంచి మ‌రో అప్డేట్..రొమాంటిక్‌ సింగిల్ రిలీజ్

రాధేశ్యాం నుంచి మ‌రో అప్డేట్..రొమాంటిక్‌ సింగిల్ రిలీజ్

by Bunty
Ad

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన్ రాధే శ్యామ్‌. ఈ పాన్ ఇండియా ఎపిక్ ల‌వ్ స్టోరిని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14 వ తేదీన థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Advertisement

ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరందుకున్నాయి. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ ల‌వ్ డ్రామా నుంచి మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌భాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌గా.. దానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల అయిన‌.. పోస్ట‌ర్లు.. టీజ‌ర్లు సినిమా పై అంచ‌నాలు పెర‌గ‌గా.. తాజాగా మ‌రో అప్డేట్ ను వ‌దిలింది చిత్ర బృందం. రాధే శ్యామ్ నుంచి హిందీ సెకండ్ సింగిల్ సోచ్ లియా పాట‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాట లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డేల మ‌ధ్య రొమాంటిక్ యాంగిల్ బాగా వ‌ర్కౌట్ అయింది. కాగా.. ఈ సినిమా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది.

Advertisement

Visitors Are Also Reading