కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, గురించి తెలియని వారు ఉండరు. మోడల్ గా కెరిర్ ప్రారంభించి ఇప్పుడు కేంద్రం మంత్రి అయ్యారు. క్యూంకీ సాస్ భీ కబీ బహు థి అనే టీవీ షో తో కెరీర్ ప్రారంభించిన స్మృతి ఆతీష్ అనే సీరియల్ లో తొలిసారిగా నటించారు. అయితే స్మృతి ఇరానీ టెలివిజన్ నటిగా మెప్పించడానికి ముందే మోడల్ గా అతని ప్రయాణాన్ని ప్రారంభించారనే విషయం చాలా మందికి తెలియదు.
READ ALSO : 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!
Advertisement
పలు టీవీ సీరియల్లలో నటించినప్పటికీ ఏక్తా కపూర్ సీరియల్ క్యూంకీ సాస్ భీ కబీ బహు థి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పాతికేళ్ల క్రితం 1998లో మిస్ ఇండియా అందాల పోటీలో కూడా స్మృతి పాల్గొన్నారు. మినీ స్కర్ట్, క్యాప్ ధరించి ర్యాంప్ వాక్ చేస్తున్న పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ర్యాంప్ పై హుషారుగా నడుస్తున్న స్మృతి ఇరానీని ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్నప్పటికీ టాప్ నైన్ కంటెస్టెంట్స్ లో ఆమె స్థానం దక్కించుకోలేకపోయారు.
READ ALSO : జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకోకుండా… ఆ ఫోటోలు వైరల్?
ఈ వీడియోలో ఎంతో స్లిమ్ గా గుర్తుపట్టలేనంతగా ఉన్న స్మృతి ఇరానీని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక స్మృతి ఇరానీ నటిగా పేరు తెచ్చుకున్న తర్వాత 2003లో బిజెపిలో చేరారు. 2004లో మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 2014లో మోడీ కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు. ఆమెతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా ఘనవిజయం సాధించారు.
READ ALSO : Pavithra Naresh Marriage : నాలుగో పెళ్లిపై అసలు విషయం చెప్పేసిన నరేష్… ‘మళ్లీ పెళ్లి’ అంటూ పోస్టర్ రిలీజ్!