Home » రాఘ‌వేంద్ర‌రావుతో సినిమా చేయ‌న‌ని తెగేసి చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

రాఘ‌వేంద్ర‌రావుతో సినిమా చేయ‌న‌ని తెగేసి చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

by AJAY
Ad

టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుల్లో రాఘ‌వేంద్ర‌రావు కూడా ఒక‌రు. ఒక‌ప్పుడు ఆయ‌న స్టార్ హీరోల‌తో సినిమా చేసి సూప‌ర్ హిట్స్ అందుకున్నారు. అంతే కాకుండా మామూలు హీరోల‌ను స్టార్ హీరోలుగా చేసిన ఘ‌న‌త కూడా రాఘ‌వేంద్ర‌రావుకు ఉంది. శ‌తాధిక ద‌ర్శ‌కుడిగా రాఘవేంద్ర‌రావు దేశ‌వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఒక్క‌ప్పుడు ఆయ‌న సినిమాల్లో గ్లామ‌ర్ సీన్లు ఎక్కువ‌గా ఉండేవ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆ విమ‌ర్శ‌ల‌కు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌దైన స్టైల్ స‌మాధానం చెప్పారు. భ‌క్తిరస సినిమాలు తీసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

ALSO READ : బాల‌కృష్ణ : సీఎం జ‌గ‌న్‌ను ఎప్ప‌టికీ క‌ల‌వ‌ను.. టికెట్ ధ‌ర‌ల‌తో స‌బంధ‌మే లేదు

Advertisement

అన్న‌మయ్య‌, పాండురంగ‌డు, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి లాంటి సినిమాల‌తో రాఘ‌వేంద్ర‌రావు త‌న మార్క్ ను వేసుకున్నారు. ఇటీవ‌ల శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా పెళ్లిసంద‌డి సినిమాకు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేసారు. అయితే ఈ సినిమా అనుకున్నమేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇక చివ‌ర‌గా రాఘ‌వేంద్ర‌రావు నాగార్జున హీరోగా శ్రీన‌మోవెంక‌టేశాయ అనే సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వంలో సినిమా రాలేదు.

Advertisement

అయితే గ‌తేడాది ఎన్టీఆర్ జ‌యంతి సంధ‌ర్బంగా రాఘ‌వేంద్ర‌రావు ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. అంతే కాకుండా సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు ఉంటార‌ని…త‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా ఈ సినిమాకు తానే నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని చెప్పారు. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. అయితే అప్ప‌ట్లో రాఘ‌వేంద్ర‌రావుకు ఉన్న క్రేజ్ వ‌ల్ల ఆయ‌న‌తో సినిమా చేసేందుకు హీరోయిన్లు హీరోలు క్యూ క‌ట్టేవారు.

కానీ ఓ హీరోయిన్ మాత్రం క‌థ న‌చ్చినా ఆయ‌న పేరు విన‌గానే సినిమా చేయ‌న‌ని చెప్పింది. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన త్రిశూలం సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా న‌టించింది. అయితే ఈ సినిమాలో రాఘ‌వేంద్ర‌రావు బాలీవుడ్ హీరోయిన్ స్మిత పాటిల్ ను అనుకున్నారు. క‌థ విని సినిమా చేస్తాన‌ని చెప్పిన స్మిత ఆ త‌ర‌వాత ఈ చిత్రానికి రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తార‌ని చెప్ప‌గానే నో చెప్పేసింది. అంతే కాకుండా ఆయ‌న ఏదో చిన్న పాయింట్ ప‌ట్టుకుని లాజిక్ లేకుండా సినిమాలు చేస్తార‌ని అందువ‌ల్లే ఆయ‌న‌తో సినిమా చేయ‌న‌ని చెప్పిన‌ట్టు పేర్కొంది.

Visitors Are Also Reading