టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు సినిమా టికెట్ల విషయం పై ఇటీవల ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సమావేశానికి కొందరూ హీరోలకు ఆహ్వానం అందినా రాలేదు అని తెలుస్తోంది. అలాంటి వారిలో బాలకృష్ణ ఒకరు.
Also Read : ఆదిత్య 369 ఎప్పటికీ మర్చిపోలేని 10 విషయాలు!
ముఖ్యమంత్రితో సమావేశం కావడానికి రావాలని ఆయనకు ఆహ్వానం వచ్చినా ఆయన వెళ్లలేదని ఓ సందర్భంగా బాలయ్య పేర్కొన్నారు. తాజాగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఈ విషయం పై మాట్లాడారు. తనకు సీఎం ఆఫీస్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని అయినా కూడా నేను తనను కలవడానికి వెళ్లలేదు అని, ఇప్పుడే కాదు ఇకపై ఎప్పుడూ కూడా సీఎం జగన్‌ను కలువను అని నాకు ఆ అవసరం లేదని బాలకృష్ణ వెల్లడించారు.
నేను నటించే సినిమాలకు తక్కువ సినిమా టికెట్ల ధరలున్నా పర్వాలేదు. నేను నా సినిమాలను పరిమితికి పెంచి డబ్బులు ఖర్చు చేయకుండా చూసుకుంటాను. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పుడూ కూడా తాను నటించిన అఖండ సినిమా విజయవంతం అయింది. ఇదే మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. నాకు సినిమా టికెట్ల రేట్ల గురించి అవసరం లేదు. కాబట్టి నేను ఇకపై జగన్‌ను కలవను అని బాలకృష్ణ తెలిపారు.
Also Read : పసివాడి ప్రాణం సినిమా నుంచి కృష్ణ ఎందుకు తప్పుకున్నారో తెలుసా..?