సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ పొట్ట పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ప్రధానంగా పొట్ట పెరగడంతో పలు ఆరోగ్య సమస్యలు మాత్రం తప్పవు. అయితే మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. దీంతో ఎలాగైనా ఆ పొట్టను తగ్గించుకోవడానికి నానా తంతాలు పడుతూ ఉంటారు. ఇక ఈ చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. చలి కారణంగా ప్రజలు బయట నడవడానికి ఇష్టపడరు అన్నది నిజం. అంతేకాదు.. వాతావరణం చల్లగా ఉండడంతో వేయించిన ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దీని కారణంగా పొట్ట మరింతగా పెరుగుతుంటుంది. కాబట్టి దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
Advertisement
అయితే బరువు పెరగడం వల్ల మన శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది. అది లుక్స్ పై కూడా ప్రభావం చూపిస్తుంది.ఈ తరం యూత్ కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే పొట్టను ఎలాగైనా తగ్గించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు. డైటింగ్ కూడా చేస్తారు. అయితే ఒక పూట తిండి తినడం మానేసినంత మాత్రాన బరువులో తేడా ఏం ఉండదు. మరి జిమ్ కి వెళ్లి వ్యాయామం చేయాలంటే అది అందరికీ కుదిరే పని కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి కొన్ని సులభమైన వ్యాయామాల ద్వారా బరువును తగ్గించుకోవడం మంచిది. మరి ఇంట్లోనే ఉంటూ పొట్ట తగ్గించుకోవడానికి చేయాల్సిన వ్యాయామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిప్పింగ్ ను జంపింగ్ రోప్ అని కూడా పిలుస్తారు. స్కిప్పింగ్ చేయడం వల్ల ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. అంతేకాకుండా ఇది బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో హెల్ప్ అవుతుందని ఇప్పటికే ప్రూవ్ అయింది.
Advertisement
అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు కూడా స్కిప్పింగ్ చేయడం వల్ల తగ్గుతాయి. లైట్ జంపింగ్ రోప్ చేయడం వల్ల మోకాళ్లు, చీలమండల పనితీరు మెరుగుపడుతుంది. పుష్ప రెగ్యులర్ గా చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ నేరుగా పొట్టలో ఉన్న కండరాలపై పడుతుంది. అంతేకాకుండా చేతిలు, కాళ్ల కండరాలను కూడా బలపరుస్తాయి. క్యాలరీలు కూడా ఎక్కువ సంఖ్యలో బర్న్ అవ్వడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ప్లాంక్ రెగ్యులర్ గా చేయడం వల్ల పొట్ట కండరాలు బలంగా తయారవుతాయి. ఒకవేళ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించాలి అని అనుకుంటే ఈ ప్లాంక్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ మూడింటితో పాటు సైక్లింగ్ చేయడం కూడా బరువును తగ్గిస్తుంది. రోజు 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే ఈజీగా బరువు తగ్గుతారు.