Home » రైలులో మీ సీటు పై కూర్చుని లేవడం లేదా..? అయితే  ఇలా చేస్తే ఫలితం పక్కా..!

రైలులో మీ సీటు పై కూర్చుని లేవడం లేదా..? అయితే  ఇలా చేస్తే ఫలితం పక్కా..!

by Anji
Published: Last Updated on
Ad

భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. మీరు చేసే చిన్న పొరపాటు మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి పడేస్తుంది. వాస్తవానికి భారతీయ రైల్వే రాత్రిపూట ప్రయాణించే ప్యాసింజర్లని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిబంధనలని మార్చింది. ఇవి సాధారణంగా రైలులో ప్రయాణించే ప్రయాణికులందరికీ తెలిసి ఉండాలి.  ముఖ్యంగా రైలులో మీ సీటు పై కూర్చుని లేవడం లేదా..? అయితే  ఇలా చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి.

Advertisement

 

ప్రతీ రోజు కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది టికెట్ లేని ప్రయాణం చేస్తూ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా టికెట్ తీసుకున్న తరువాత కూడా కొంత మంది తమ సీట్లలో కూర్చొని ప్రయాణించలేని పరిస్థితి ఉంటుంది. మీ సీటుపై ఎవరైనా వచ్చి కూర్చున్నట్టయితే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.  అప్పుడు మీ సీట్లో మీరు కూర్చొవచ్చు.  అన్నింటిలొ మొదటిది మీరు ఎటువంటి వాదన లేకుండా కోచ్ లో ఉన్న టీటీకి మీ సమస్యను వివరించండి.

Advertisement

ఒకవేళ కోచ్ లో టీటీఈ అందుబాటులో లేకుంటే.. వెంటనే 139 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కాల్ చేసేటప్పుడు మీ చేతిలో టికెట్ ఉందని గుర్తుచుకోండి. ఎందుకంటే ఆ అధికారి మీ వద్దకు వచ్చిన తరువాత టికెట్ అడుగుతారు. మీరు కాల్ చేసి ఫిర్యాదు చేసినా టీటీఈకి ఫిర్యాదు చేసినా వెంటనే మీ వద్దకు వచ్చి మీ సీటు మీకు దక్కేలా చేస్తారు. ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు ఇలాంటి సమస్యను రైలులో చాలా మంది ఎదుర్కొంటారు. ఇలా చేయడం వల్ల ఏ టెన్షన్ ఉండదు. హ్యాపీగా రైలులో జర్నీ చేయవచ్చు.

మరిన్ని  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి!

Visitors Are Also Reading