మహానటి సినిమాతో టాలీవుడ్ లోకి ఆరంగేట్రం చేసిన దుల్కార్ సల్మాన్ హను రాఘవపూడి దర్శకత్వంలో రెండవ తెలుగు సినిమా చేస్తున్నాడు. సీతారామ అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగగా నటిస్తోంది. టైటిట్ అనౌన్స్‌మెంట్ దగ్గరి నుంచి పాజిటివ్ః వైబ్స్ మూటగట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ వచ్చింది. ఎవ్వరూ లేని రామ్ అనే ఓ ఒంటరి ఐనికుడు, అతని పడే సీత అనే అమ్మాయి చుట్టూ ఓ అందమైన ప్రేమకథగా ఈ సినిమా సాగనున్నట్టు టీజర్ ని బట్టి అర్థమవుతోంది. కనుల విందుగా ఉన్న దృశ్యాలు మనసుల్ని కట్టిపడేసే ఆ డైలాగులు వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Advertisement
Advertisement
ఆకాశవాణి లెప్టినెంట్ రామ్ నిన్నే నాకు పరిచయమైన పేరు. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడడానికి ఓ కుటుంబం, కనీసం ఉత్తరం రాయడానికి ఒక్కపరిచయం కూడా లేదనే విషయం నిన్నే నాకు తెలిసిందంటూ హీరో గురించి హీరోయిన్ చెప్పే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఇంకా ఆ తర్వాత డియర్ రాము నీకు ఎవరు లేరా..? V ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావ్ అయ్యా కొత్తగా అంటూ చివర్లో ఇట్లు మీ భార్య సీతామహాలక్ష్మి అని సాగే డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సారి రాఘవపూడి ఒక గొప్ప ప్రేమకథతో అందరిని మైమరిచి పెంచే విధంగా కనిపిస్తున్నారు. 1965 బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో రస్మిక సుమంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ స్వప్న మూవీస్ బ్యానర్ పై నిర్మాత మవుతుంది ఈ సినిమాను ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్నది. తెలుగు తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.