ఈరోజు అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో మదర్స్‌డే విషెష్‌తో మారుమ్రోగుతుంది. వాస్తవానికి విదేశాలలో ప్రారంభమైన మదర్స్ డే ఇప్పుడు మన దేశంలోనూ ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వచ్చింది. తల్లికోసం కేవలం ఒక్కరోజు కేటాయించడమేంటని విమర్శలు దీనిపై ఉన్నాయి. తల్లి కోసం ఒక్కరోజు అని కాదు.. కానీ ఆ ప్రేమమయి, నిస్వార్థ త్యాగమయి జీవితాన్ని సెలబ్రెట్ చేసేందుకు ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించడంలో తప్పు ఏముందన్న వాదన కూడా వినిపిస్తుంది. పలువురు ప్రముఖులు మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లవ కురిపిస్తున్నారు.
Advertisement
ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార తన తల్లికి మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. అమ్మ కోసం స్పెషల్ గిప్ట్ ఒకటి ప్లాన్ చేసాను. అది సర్‌ప్రైజ్. అదేవిధంగా ఆదివారం మొత్తం అమ్మతో గడపాలని డిసైడ్ అయ్యాను. అసవరమైనప్పుడు మాత్రమే స్ట్రిక్ట్ మిగతా సమయాల్లో మా అమ్మ చాలా స్వీట్ అంటూ పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది సితార. మహేష్ కూడా తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా నా తల్లికి లైఫ్ లైన్స్ అయిన నా బిడ్డల తల్లికి వారితో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి మదర్స్ డే విషెష్ తెలియజేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
Advertisement
ముఖ్యంగా ఇంత చిన్న వయస్సులోనే సితారకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఆమెకు వస్తున్న పాపులారిటీ మీడియా అటెన్షన్ పట్ల మహేష్, నమ్రత ఏమాత్రం భయపడడం లేదు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడారు. సితార ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో.. అది చేసే విధంగా తాము ప్రోత్సహిస్తున్నామని చెప్పింది. ఈ వయస్సులో పిల్లలు గైడెన్స్ అవసరం అని.. భావిస్తున్నట్టు వివరించింది. ఏది చేయాలో ఏది చేయకూడదనే అంశాలతో చాలా క్లారిటీతో సితార తన లిమిట్స్‌లోనే ఉంటూ ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు.
Also Read :
శ్రీకృష్ణుడు తలపై నెమలి ఫించం ధరించడానికి కారణం ఏంటో తెలుసా..?
గుడిలో తీర్థం తీసుకొని తలకు అద్దుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!!