Home » బరిలో దిగనున్న ఎమ్మెల్యే సీతక్క కొడుకు.. ఎక్కడినుండి అంటే..!

బరిలో దిగనున్న ఎమ్మెల్యే సీతక్క కొడుకు.. ఎక్కడినుండి అంటే..!

by Sravanthi
Ad

తెలంగాణ రాజకీయ నాయకులలో ఉన్నటువంటి మహిళ ఎమ్మెల్యేలలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సీతక్క. ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పేదల పెన్నిధిగా నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఉంటుంది. కరోనా సమయంలో చేసిన సేవలు దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందాయి.. ప్రజల లీడర్ గా పేరుపొందిన సీతక్క అంటే దేశం మొత్తం తెలుసు. అలాంటి సీతక్క ములుగు ఎమ్మెల్యేగా గెలిచి అనేక సేవలందిస్తోంది. అయితే మరోసారి కూడా ములుగు నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

also read:నీటిని పదే పదే మరిగించి తాగుతున్నారా..? అయితే ఆ ప్రమాదం పొంచి ఉన్నట్టే జాగ్రత్త..!

ఈ తరుణంలో సీతక్క కొడుకు సూర్య కూడా ఈసారి పోటీలో నిలబడనున్నట్టు తెలుస్తోంది. ములుగుకు ఆనుకొని ఉన్న పినపాక నియోజకవర్గం నుండి సూర్య పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకుముందు పినపాకా కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావు పార్టీ మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి సూర్య పినపాకలో ఉంటూ తన కేడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకుంటూ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

పేదలకు ఎలాంటి ఆపద వచ్చిన నేనున్నానంటూ ప్రజల వద్దకు వెళుతున్న సూర్య , తొలిసారిగా పోటీలో నిలబడేందుకు రెడీ అవుతున్నట్టు ప్రకటన జారీ చేశాడు. ఇక అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా పినపాక నియోజకవర్గంలో తన సత్తా ఏంటో చూపిస్తాను అని చెప్పకనే చెప్పాడు. యువ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సూర్యకు మరి ఆ సీటు దక్కుతుందో లేదో ముందు ముందు తెలుస్తుంది. ఏది ఏమైనా సీతక్క చేసినట్టు పేదలకు న్యాయం చేయాలని తపన ఆయనకు ఉంటే తప్పకుండా గెలుస్తాడనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

also read:భోగి పండుగ రోజు రేగు పళ్లను పోయడానికి కారణం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading