ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల క్యాన్సర్ తో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. సిరివెన్నెల సినీ పరిశ్రమలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏకంగా దేశ ప్రధాని సంతాపం ప్రకటించే స్థాయికి సిరివెన్నెల ఎదిగారు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇప్పటికీ సినీ పరిశ్రమ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతోంది. ఇదిలా ఉంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇద్దరు కుమారులు కూడా చిత్రపరిశ్రమలోనే ఉన్నారు కానీ వారి గురించి పెద్దగా పరిచయం లేకపోవచ్చు.
సిరివెన్నెల కుమారులు ఎవరు…వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం… సిరివెన్నెల కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు యోగేశ్వర్ శర్మ కాగా చిన్న కుమారుడు రాజా.. పెద్ద కుమారుడు యోగేశ్వర శర్మ సంగీతదర్శకుడిగా రాణిస్తున్నారు. “కుదిరితే కప్పు కాఫీ” అనే సినిమాతో యోగేశ్వర శర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. రంగు అనే సినిమాకు కూడా యోగేశ్వర శర్మ సంగీతదర్శకుడిగా పని చేశాడు.
Advertisement
Advertisement
ఈ రెండు సినిమాలతో పాటు అనేక చిత్రాలకు ఆయన స్వరాలు సమకూర్చారు. అంతేకాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు రాజా “కేక” అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అంతేకాకుండా రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. అదేవిధంగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాలో వరుణ్ కు అన్నగా నటించింది కూడా రాజానే అన్న విషయం ఎవరికి తెలియదు. ఈ రెండు సినిమాలతో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రాజా. అలా సిరివెన్నెల ఇద్దరు కుమారులు కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు.
Also read :భీమ్లా నాయక్ నుండి “అడవితల్లి మాట” సాంగ్ వచ్చేసింది…!