Home » భీమ్లా నాయ‌క్ నుండి “అడ‌విత‌ల్లి మాట” సాంగ్ వ‌చ్చేసింది…!

భీమ్లా నాయ‌క్ నుండి “అడ‌విత‌ల్లి మాట” సాంగ్ వ‌చ్చేసింది…!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి అడవితల్లి మాట అనే పాటను చిత్రం విడుదల చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. థ‌మ‌న్ ఈ పాట‌కు స్వ‌రాలు స‌మ‌కూర్చారు. అంతేకాకుండా ఈ పాటను దుర్గమ్మ‌… సాహితీ కలిసి పాడారు. కాగా ఈ పాట ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇద్దరి మధ్య ఉండే ఈగోల మధ్య సాగే కథ కావడం తో…ఈ పాటలోని లిరిక్స్ కూడా ఇద్దరి మధ్య ఈగోలను తెలిపే విధంగా ఉన్నాయి.

Also Read: సిరివెన్నెల ఇద్దరు కుమారులు తండ్రికి తగ్గ తనయులు…ఏం చేస్తున్నారో తెలుసా…?

Advertisement

పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఉండే ఒక పాట లా ఈ పాటలోని లిరిక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి భీమ్ భీమ్ భీమ్లా నాయక్ పాటను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేయగా ఇప్పుడు విడుడల చేసిన అడవి తల్లి మాట కూడా యూట్యూబ్ ను షేక్ చేసే విధంగా ఉంది. పాటలో రానా పవన్ కళ్యాణ్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పవన్…రానా ఇద్దరూ మాస్ లుక్ లో కనిపిస్తూ అలరిస్తున్నారు.

Advertisement

Also read :సిరివెన్నెల ఇద్దరు కుమారులు తండ్రికి తగ్గ తనయులు…ఏం చేస్తున్నారో తెలుసా…?

ఇదిలా ఉంటే ఈ సినిమా మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ అయ్యప్ప‌నుమ్ కోషియం కు రీమేక్ గా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సినిమాకు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు. ఇక సినిమాలో రానాకు జోడీగా సంయుక్త మీన‌న్ న‌టిస్తుండ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. ఇక ఇప్ప‌టికే సినిమా టీజ‌ర్ వ‌ద‌ల‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రో వైపు ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 12న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Visitors Are Also Reading