Dhanush ‘Sir’ Movie Dialogues and Lyrics in Telugu: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన మొదటి బైలింగ్యువల్ సినిమా సార్. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ పై సాయి సౌజన్య సహా నిర్మాతగా వ్యవహరించారు. శ్రీకర స్టూడియోస్ కూడా సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, అక్కినేని మిస్టర్ మజ్ఞు, నితిన్ రంగ్ దే వంటి ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి. తన పంథాను మార్చి చేసిన సినిమా ఇది. ఈ చిత్రంలో విద్య యొక్క గొప్పతనం, అందుకోసం తల్లిదండ్రులు పడే ఇబ్బందులను చాలా చక్కగా చూపించారు.
Advertisement
అంతేకాదు.. మధ్యలో సినిమా థియేటర్ యొక్క గొప్పతనాన్ని కూడా చాలా చక్కగా చూపించాడు దర్శకుడు అట్లీ. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సంపాదించుకుని మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ప్రేక్షకులను వెంటాడేవి ఏంటి..? అంటే అవి డైలాగ్స్ సంభాషణలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సార్ చిత్రాన్ని థియేటర్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొడుతున్న డైలాగులను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Top 10 Sir Movie Dialogues Telugu
- ఇతనే ద్రోణాచార్యుడు అయ్యింటే ఏక లవ్యుడి దగ్గర ఒకవేలు కాదు, ఫీజు కింద 10వేళ్లు లాక్కుని ఉండేవాడు.
- మనకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే మోయలేనంత ప్రెజర్ అయినా ఇవ్వాలి, లేదా చేయలేనంత పనైనా అప్పజెప్పాలి. అప్పుడు జీతం పెంచమని అడగడం మానేసి ఉద్యోగం తీయకపోతే చాలు అన్నట్టు పడుంటారు.
- ఇండియాలో విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు.. అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువ ఎక్కువ.
- చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వారికి చదువు దొరకలేదు.. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ల కోసం ఉంటారన్న నమ్మకం వాళ్లకి కుదరడం లేదు.
- అడిగింది కొనివ్వకపోతే పిల్లలు ఆ ఒక్క రోజే ఏడుస్తారు కానీ వాళ్ల అమ్మ, నాన్న..కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు.
- డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది
- అవసరానికి కులం ఉండదు.. అలాగే అవసరం లేని మనిషి కూడా ఉండడు. ఇది మీకు అర్థమైన రోజు మనసులో కులం ఉండదు.
- ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం ఏ వ్యాపారంలో అయినా టార్గెట్ మిడ్ క్లాస్ కస్టమర్సే.
- క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి జీరో ఫీజు, జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజు మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పటి ట్రెండ్.
- గుళ్లో దేవుడిని నువ్వు ఏనాడు చూపించలేదు
బడిలో చూశాను.. మా దేవుడు ఈయన.
- చదువు అనేది వ్యాపారంగా మారి చాలా కాలమైంది
భవిష్యత్ లో ఇది ఇంకా పెద్ద వ్యాపారం అవుతుంది
ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వసూల్ చేసే ఫీజుల కంటే
ఎక్కువ ఫీజులు ఎల్.కె.జీ, యూకేజీ వసూలు చేసే రోజులు వస్తాయి.
- బూస్ట్ కి సచిన్ ఉన్నట్టు..
మిమ్మల్ని వాడి ఇన్ స్టిట్యూట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా
ఉండమంటున్నాడు.
- వాడి అహాన్ని వాడుకొని మీరు ఎదగండి..
గొప్ప పొజిషన్ కి వెళ్లాక మీలాంటి వాళ్లకు విద్య
సరైన పద్దతిలో అందేలా చూడండి.
Also Read : బాణం’ తరహాలో పాత మూవీ టైటిల్స్‌తో వచ్చిన తెలుగు