Telugu News » Blog » పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే హాలీవుడ్ సింగర్ మృతి.. అసలు ఏం జరిగిందంటే ?

పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే హాలీవుడ్ సింగర్ మృతి.. అసలు ఏం జరిగిందంటే ?

by Anji

సాధారణంగా పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖ, సంతోషాలతో జీవించాలని ఎవరైనా ఆశపడుతుంటారు. అందులో కొంత మంది ఆశలు గంటలు కూడా గడవకముందే ఆవిరైపోతుంటాయి. అలాంటి ఘటనే హాలీవుడ్ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఫేమస్ సింగర్ జేక్ ఫ్లింట్ హటాన్మరణం చెందారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Advertisement

సింగర్ జేక్ (37) బ్రెండ్ విల్సన్ ని వివాహం చేసుకున్నాడు. అమెరికాలో వీరి పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది గంటలకే జేక్ మరణించాడు. ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. జేక్ మరణంతో ఆయన భార్యతో పాటు పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి చెందినట్టు అతని స్నేహితుడు ప్రచారకర్త క్లిఫ్ డోయల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. 

Advertisement

Also Read :  ప‌న‌న్ రీల్ హీరో కాదు రియ‌ల్ హీరో..ఆ అమ్మాయి పెళ్లి ఎంత సాయం చేశారంటే..?

Manam News

1985లో అమెరికాలోని ఓక్లామాలో జన్మించిన జేక్.. వాట్స్ యువర్ నేమ్, లాంగ్ రోడ్డు బ్యాక్ హోం, కౌటౌన్, ఫైర్ లైన్ వంటి హిట్ ఆల్బమ్స్ తో పాప్ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తొలి ఆల్భమ్ నాట్ ఓకే 2016లో విడుదల అయింది. ఆ తరువాత వరుసగా చాలా ఆల్బమ్స్ తో మ్యూజిక్ ప్రియులను అలరించాడు. లైవ్ ఈవెంట్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఈ ఏడాది జనవరిలోనే బ్రెండా విల్సన్ తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించారు జేక్.  తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించాడు. 

Also Read :  జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడకూడదని చంద్రబాబు ఒట్టు… సంచలన విషయాలు బయటపెట్టిన వంశీ..?