తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రసిద్ధ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సింగర్ మనో. నేపథ్య గాయకుడు అంటే ఈయన పేరు ముందుగా గుర్తుకొస్తుంది. మనో తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కూడా అనేక పాటలు పాడాడు., 1965 అక్టోబర్ 26న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి లో ఆయన జన్మించారు. ఇప్పటివరకు మనో కెరీర్లో 30 వేల వరకు పాటలు ఉన్నాయి. 1984లో కర్పూర దీపం అనే చిత్రం ద్వారా తన ఒరిజినల్ పాటను అందించిన మనో ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదిగారు. అంతేకాకుండా ఆయన 3000కు పైగా లైవ్ కచేరీలు కూడా ఇచ్చారు. అలాగే రజనీకాంత్ మరియు కమలహాసన్లకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు సాధించాడు.
also read:ఐపీఎల్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్లు వీరే..!
Advertisement
అలాంటి మనో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత చరిత్ర గురించి సింగర్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. సింగర్ మనో 51 సంవత్సరాలు లోపే విశ్వనాథం, కె.వి.మహదేవన్, వి కుమార్, సత్యం, రమేష్ నాయుడు,ఎస్ రాజేశ్వరరావు టాప్ సంగీత దర్శకులతో పనిచేశానని ఇలాంటి అవకాశం ఇప్పటివరకు ఎవరికి వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు దక్కిందని అన్నారు. అప్పట్లో బాలసుబ్రమణ్యం గారితో కూడా పని చేశానని ఆయన బిజీగా ఉన్న సమయంలో నేను ఎక్కువగా వెళ్లేవాడినని, అన్నారు. కానీ పారితోషికం చాలా తక్కువగా ఇచ్చేవారని బాలసుబ్రహ్మణ్యం గారితో పోల్చుకుంటే నాది రెండు రేట్లు తక్కువగా ఉండేదని అన్నారు.
Advertisement
also read:బాలయ్య భైరవద్వీపం సినిమాతో చిరంజీవి, రజినీకాంత్ లకు ఉన్న లింక్ ఏంటి.
అప్పట్లో ఎక్కువగా క్యాసెట్లు ఉండేవని, ఆ క్యాసెట్లు ఎక్కువగా సేల్ కావాలంటే సుబ్రహ్మణ్యం గారితో ఒక్క పాట పాడించుకొని ఆయన పేరు ముందుగా పెట్టి, మిగతా నాలుగు ఐదు పాటలు మాతో పాడించుకునేవారని ఆ విధంగా వారు బడ్జెట్ తగ్గించుకునే వారని అన్నారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో సింగర్లకు చాలా తక్కువ పారితోషికం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో బాలసుబ్రమణ్యం కు 3500 ఉంటే నాకు 1500 రూపాయలు ఒక పాటకి ఇచ్చేవారని, అది కూడా ఎంతో కష్టంగా ఇచ్చేవారని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో తక్కువ రెమ్యూనరేషన్ సింగర్లకు ఎందుకు ఇస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదని అన్నారు. కొన్ని సినిమాలకు లక్షల పెట్టుబడులు పెడుతూ మోసపోతుంటారు. కానీ మా వరకు వచ్చేసరికి చాలామంది నిర్మాతలు బేరం ఆడతారని తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఇది కొనసాగుతుందని తెలియజేశారు. టాప్ సింగర్స్ అంటే ఎంతో సంపాదించుకుంటారని అనుకుంటారు. కానీ అదేమీ ఉండదంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
also read: