సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు జానపదాలకు కూడా క్రేజ్ పెరుగుతోంది. పల్లె కోయిలలకోసం సినిమా చిత్రపరిశ్రమ తివాచిపరుస్తోంది. ఇప్పటికే పలువురు జానపదకళాకారులకు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెరకెక్కిన భీమ్లానాయక్ సినిమాతో కూడా మరో ఇద్దరు జానపద కళాకారులకు గౌరవం దక్కింది. భీమ్లానాయక్ టైటిల్ పాటలో కిన్నెర స్వరాలు అందించిన మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆయనకు కోటి రూపాయల నజరానా ప్రకటిచింది.
అంతే కాకుండా భీమ్లా నాయక్ తరవాతనే మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న మరో జానపద కళాకారిణి దుర్గవ్వ.ఈ సినిమాలో దుర్గవ్వ అడవితల్లి అనే పాటను పాడి అలరించింది. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన దుర్గవ్వకు జానపద పాటలు పాడటం అలవాటు. ఆమె పాడిన సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాట యూట్యూబ్ ను షేక్ చేశాయి.
Advertisement
Advertisement
ఈ రెండు పాటలు మంచి హిట్ అవ్వడంతో దుర్గవ్వకు భీమ్లానాయక్ సినిమాలో సాంగ్ పాడే అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా దుర్గవ్వ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు భీమ్లా నాయక్ లో అవకాశం ఎలా వచ్చింది. అడవి తల్లి పాట పాడినందుకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనే విషయాలను పంచుకుంది.
also read : రామ్ చరణ్ కంటే ముందు “మగధీర” కథ ఎవరి వద్దకు వెళ్లిందో తెలుసా..?
కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దుర్గవ్వ తాను పొలం పనులు చేసే సమయంలో కూడా పాటలు పాడుతూ పనిచేస్తున్నవారిలో మరింత జోష్ పెంచేవారట. ఇక తాను పాడిన సిరిసిల్ల సిన్నది పాట మంచి హిట్ అవ్వడంతో భీమ్లానాయక్ సినిమాలో పాడే అవకాశం దక్కింట. అంతే కాకుండా ఈ పాట పాడిన తరవాత తనకు రూ.10 వేలు ఇచ్చిపంపించారట. ఐదు నిమిషాల్లో పాట పాడి వచ్చానని…మిగతా డబ్బులు నా కూతురుకు ఇచ్చారని దుర్గవ్వ వెల్లడించింది.