Home » సింధు డ్యాన్స్ అదుర్స్‌.. మీకు సంతోషాన్నిచ్చేది చేయాల‌ని పోస్ట్‌..!

సింధు డ్యాన్స్ అదుర్స్‌.. మీకు సంతోషాన్నిచ్చేది చేయాల‌ని పోస్ట్‌..!

by Anji
Ad

అచ్చ తెలుగు అమ్మాయి పూస‌ర్ల వెంక‌ట సింధు తెలియ‌ని వారు ఉండ‌రు. దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందింది సింధు. బ్యాడ్మింట‌న్‌లో భార‌త్ పేరుని ప్ర‌పంచంలో స‌గ‌ర్వంగా నిల‌బెట్టిన సింధు అంద‌రికీ ప‌రిచ‌య‌మే. హైద‌రాబాద్‌కు చెందిన పీవీ సింధు బ్యాడ్మింట‌న్‌లో అప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ సాధించ‌ని ఘ‌న‌త సాధించింది. ఒలింపిక్స్ ఫైన‌ల్స్‌కు వెళ్ల‌డ‌మే రికార్డు అనుకుంటే వెళ్లిన తొలిసారే కాంస్య ప‌త‌కం సాధించింది. ఇక ఆ త‌రువాత సిల్వ‌ర్ మెడ‌ల్‌ను అందుకుంది. ప‌లు ఛాంపియ‌న్ షిప్‌ల్లో గోల్డ్ మెడ‌ల్ సాధించి యువ‌త‌కు ఆమె ఆద‌ర్శంగా నిలిచింది.

Advertisement

సింధు అటు బ్యాడ్మింట‌న్ క్రీడాలోనే కాద త‌న‌కు డ్యాన్స్ చేయ‌డం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే అప్పుడ‌ప్పుడు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ మ‌ధ్య క‌చ్చా బాదాం అంటూ స్టెప్పులేసిన సింధు ఇప్పుడు మ‌రొక రీమిక్స్ పాట‌కు డ్యాన్స్ చేసి ఆశ్చ‌ర్య ప‌రిచింది. అంతేకాకుండా వీడియోకి కింద మీకు ఏది సంతోషాన్నిఇస్తుందో అదే చేయాల‌ని క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ట్రెండింగ్‌లో ఉన్న రెండు రీమిక్స్ పాట‌ల‌కు సింధు స్టెప్పులేసింది.

Also Read : 

ప్రేమికులు లేదా పెళ్లైన వారు మీపై న‌మ్మ‌కం పెర‌గాలంటే ఇలా చేయండి..!

బ్యాడ్మింట‌న్ కోర్టులో పులిలా ఆడే సింధు నాజుకుగా డ్యాన్స్‌ల‌తో కూడా అద‌రగొడుతుంది. ఇక నెటిజ‌న్లు డ్యాన్స్ సూప‌ర్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే సింధు ఈ వీడియోని అభిమానుల‌తో పంచుకున్న వెంట‌నే ల‌క్షల్లో వ్యూస్, లైక్స్ వ‌స్తున్నాయి. సినిమా సెల‌బ్రెటీల‌కు ధీటుగా సింధుకు ఫాలోయింగ్ ఉండ‌డం విశేషం. ఈ ఫాలోయింగ్ ను ఇలాగే కొన‌సాగాల‌ని మ‌నం కోరుకుందాం.

Visitors Are Also Reading