సినిమా ఇండస్ట్రీలో హీరోలకు యాబై, అరవై ఏళ్లు వచ్చినా హీరోయిన్ లు మాత్రం ముప్పై దాటిందంటే స్క్రీన్ పై కనిపించడం కష్టమే. ఒకవేళ ఉన్నారు అంటే అక్క, వదిన పాత్రలు చేసుకోవాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో రానిస్తున్న హీరోల కెరీర్ ప్రారంభంలో నటించిన చాలా మంది హీరోయిన్ లు ఇప్పటికే హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పేశారు. ఇక వారిలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోగా మరికొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read: గోవిందా గోవిందా, శుభలగ్నం సినిమాలకి మధ్య ఇలాంటి సంబంధం ఉందా..?
Advertisement
అలా సినిమాలకు దూరమైన లిస్ట్ లో ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత కూడా ఉన్నారు. అంకిత మొదటిసారి టాలీవుడ్ లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అంకిత వరుస ఆఫర్ లను అందుకున్నారు. ఈ సినిమా తరవాత అంకిత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించారు.
Advertisement
Also Read: చిరంజీవిపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆ దర్శకులు.. అసలు కారణం ఏంటంటే..?
సింహాద్రిలో భూమిక హీరోయిన్ గా నటించగా అంకిత సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తరవాత అంకిత తిరిగి యూసుకోలేదు. విజయేంద్రవర్మ, స్టేట్ రౌడీ, వినాయకుడు. సీతారాముడు లాంటి సినిమాలలో నటించింది. ఈ అమ్మడు గ్లామర్ డోస్ కూడా మిగితా హీరోయిన్ ల కంటే ఎక్కువగా ఉండడంతో కుర్రాళ్ల ఫేవరెట్ గా మారిపోయింది.
ఇక వరుస ఫ్లాప్ లు పడటంతో అంకిత మెల్లిమెల్లిగా సినిమాలకే దూరం అయ్యింది. ఆ తరవాత పూణేకు చెందిన విశాల్ ఝాటక్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తరవాత ఈ జంటకు ఓ బాబు జన్మించాడు. దాంతో ఫ్యామిలీ లైఫ్ లో బీజీ అయిపోయింది. అంతే కాకుండా అంకిత వజ్రాల వ్యాపారం చేస్తోంది. తన తండ్రికి చెందిన ఈ వ్యాపారాన్ని ప్రస్తుతం అంకిత లీడ్ చేస్తోంది.
Also Read: Chanakya Niti : మగవాడి జీవితాన్ని ఈ 4 పరిస్థితులు విచారంగా మారుస్తాయట..!