Home » Chanakya Niti : మ‌గ‌వాడి జీవితాన్ని ఈ 4 ప‌రిస్థితులు విచారంగా మారుస్తాయ‌ట‌..!

Chanakya Niti : మ‌గ‌వాడి జీవితాన్ని ఈ 4 ప‌రిస్థితులు విచారంగా మారుస్తాయ‌ట‌..!

by Anji
Ad

ఆచార్య చాణ‌క్యుడు మ‌నిషి ఎదుర్కునే విచారానికి సంబంధించిన నాలుగు ప‌రిస్థితుల గురించి పేర్కొన్నాడు. ఒక వ్య‌క్తి విచారాన్ని భ‌రించాల్సి వ‌స్తే అత‌ను జీవించ‌డం క‌ష్టం. ప్ర‌తీ క్ష‌ణం క‌ష్టాల క‌డ‌లిలో జీవ‌నం సాగిస్తాడు. ప్రేమికులు విడిపోవ‌డం, సొంత వ్య‌క్తుల‌ను అవ‌మానించ‌డం, అప్పుల బాధ‌లు, చెడు వ్య‌క్తుల‌కు సేవ‌, ద‌రికం ప‌ట్ల విర‌క్తి చెందిన స్నేహితుడు శ‌రీరానికి అగ్ని లేకుండా కాల్చేస్తారని చెప్పారు.

chanakya-niti

chanakya-niti

భ‌ర్త త‌న భార్య నుంచి విడిపోతే భార్య త‌న భ‌ర్త చేసే ప్ర‌తి చిన్న విష‌యాన్ని చూసుకుంటుంది. ఇక భ‌ర్త జీవితం మాత్రం దుఃఖ‌మ‌యమే. భార్య వెళ్లిపోయిన త‌రువాత అత‌న్ని అలా చూసుకునే వారు ఉండ‌రు. అటువంటి ప‌రిస్థితిలో భ‌ర్త ఎల్ల‌ప్పుడూ త‌న భార్య గురించి ఆలోచిస్తాడు. ప్ర‌తిక్ష‌ణం లోలోప‌ల కుమిలిపోయి ఏడుస్తుంటాడు.

Advertisement

Advertisement

ఒక వ్య‌క్తి త‌న కుటుంబ స‌భ్యుల‌చే అవ‌మానించ‌బ‌డాల్సి వ‌స్తే.. అత‌నికి జీవితం భారంగా మారుతుంద‌ని ఆచార్య న‌మ్మాడు. అటువంటి ప‌రిస్థితిలో ఆ వ్య‌క్తి అవ‌మానాన్ని మ‌రిచిపోలేడు. బాధ‌తో కుమిలిపోతాడు. అత‌ను ప్ర‌తిక్ష‌ణం ఉక్కిరి బిక్కిరి అవుతాడు.

 

ఇక ఎవ్వ‌రి వద్ద‌నైనా అప్పు తీసుకొని ఆ అప్పును తిరిగి చెల్లించ‌క‌పోతే అత‌ని జీవితం క‌ష్ట త‌రం అవుతుంది. అలాంటి వారికి రాత్రి నిద్ర‌, ప‌గ‌టి ప్ర‌శాంత‌త పోతుంది. వారు లోప‌ల ఉక్కిరి బిక్కిరి అవుతూ జీవిస్తారు.

ఆచార్య పేద‌రికాన్ని అతిపెద్ద శాపంగా భావించారు. ఆచార్య చాణ‌క్యుడు పేద‌వాడి జీవితంలో సంతోషం ఉండదు అని, దాని వ‌ల్ల త‌న మ‌న‌సులో నిరంత‌రం మ‌ద‌న‌ప‌డుతూ ఉంటాడు అని చెప్పారు. ఆనందాన్ని పొందాల‌నే కోరిక‌తో అలాంటి వ్య‌క్తి కొన్నిసార్లు త‌ప్పుడు మార్గంలో వెళ్తాడు. అప్పుడు అత‌ని జీవితం మ‌రింత బాధ‌కరంగా మారుతుంది.

Also Read : 

ప్రతి స్త్రీ తన భర్త విషయంలో తెలుసుకోవలసిన విషయాలు.. ఇందులో 5వది చాలా ఇంపార్టెంట్..!!

క‌ష్ట స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు ఎలా బ‌య‌ట‌ప‌డాలంటే..?

Visitors Are Also Reading