Home » చిరంజీవిపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న ఆ ద‌ర్శ‌కులు.. అస‌లు కార‌ణం ఏంటంటే..?

చిరంజీవిపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న ఆ ద‌ర్శ‌కులు.. అస‌లు కార‌ణం ఏంటంటే..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి అంటే దాదాపు తెలియ‌ని వారుండ‌రు. దాదాపు 152 చిత్రాలు పూర్తి చేసుకుని దూసుకెళ్తున్నారు చిరంజీవి. ఖైదీ నెంబ‌ర్ 150 త‌రువాత రీ ఎంట్రీ మెగాస్టార్ వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. ఇటీవ‌లే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆచార్య సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇక అప్ప‌టి నుంచి ఇటు చిరంజీవి, అటు కొర‌టాల ఏదో ఒక సంద‌ర్భంలో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇటీవ‌లే చిరంజీవి ఓ కార్య‌క్ర‌మంలో టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.


అస‌లు ఎప్పుడు కూడా వివాదాల జోలికి వెళ్ల‌ని చిరంజీవి ఇటీల మాత్రం త‌మ మాట‌ల వ‌ల్ల విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. ఇటీవ‌లే అమీర్‌ఖాన్ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా కొన్ని ఇన్ డైరెక్ట్ వ్యాఖ్య‌లు చేశారు మెగాస్టార్. నెట్టింట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇక కొంద‌రూ చిరంజీవిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా లాల్‌సింగ్ చ‌డ్డా తెలుగు ట్రైల‌ర్ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో చిరంజీవి పాల్గొన్నారు. అక్క‌డ మీడియా స‌మావేశంలో చిరంజీవి చేసిన కామెంట్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. బాలీవుడ్‌, టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌ను పోల్చుతూ.. బాలీవుడ్ ద‌ర్శ‌కుల‌ను త‌న పొగ‌డ్త‌ల‌తో ఆకాశానికెత్తారు. టాలీవుడ్ ద‌ర్శ‌కులు షూటింగ్ స‌మ‌యంలోనే డైలాగ్‌లు రాస్తారు అని, బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మాత్రం చాలా ముంద‌స్తుగానే డైలాగ్ లను సిద్ధం చేసి ఉంచుతార‌ని వాటిని న‌టీన‌టులు ప్రాక్టీస్ చేస్తార‌ని.. దీంతో బాలీవుడ్ యాక్ట‌ర్స్ షూటింగ్ చాలా బాగా యాక్టింగ్ చేస్తార‌ని చెప్పుకొచ్చారు చిరంజీవి.

Advertisement

Advertisement


టాలీవుడ్ ద‌ర్శ‌కులు అప్ప‌టిక‌ప్పుడు హీరోల‌కు ఎదురుగా సెట్‌లోనే కూర్చొని డైలాగ్‌లు రాయ‌డం వ‌ల్ల ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని మెగాస్టార్ పేర్కొన్నారు. త‌న‌లాంటి సీనియ‌ర్ హీరోకు కూడా ఇలాంటి అనుభ‌వాలు చాలా ఎదుర‌య్యాయ‌ని.. దీంతో న‌టించే స‌మ‌యంలో ఏకాగ్ర‌త లోపించి హీరోలు త‌మ డైలాగ్‌ల‌ను స‌రిగ్గా చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని కామెంట్ చేశారు. అయితే చిరంజీవి ఇన్‌డైరెక్ట్‌గా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌నుద్దేశించే ఈ కామెంట్స్ చేశార‌ని ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. దీంతో చిరంజీవిని ప‌లువురు నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ వంటి సీనియ‌ర్ హీరోలు ఈత‌రం ద‌ర్శ‌కుల‌తో స‌ర్దుకుపోతుంటే మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం ఏంట‌ని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.


ఆచార్య విష‌యంలో కొర‌టాల శివ‌ను దోషిగా చూడ‌డం మానుకోవాల‌ని చిరంజీవిపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ధానంగా టాలీవుడ్ ఒక హీరో అయిన‌టువంటి చిరంజీవి టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో వారికి కోపాన్ని తెప్పిస్తున్నాయ‌ట‌. ముగిసిపోయిన స‌మ‌స్య‌ను చిరంజీవి మ‌ళ్లీ తెర‌పైకి తీసుకొచ్చి అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌ల పాలవుతున్నార‌ని చిరంజీవిపై ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. కొర‌టాల త‌న త‌రువాత సినిమాను ఎన్టీఆర్ తో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఆ సినిమాను హిట్ కొట్టి తానేంటో మెగాస్టార్ కి తెలియ‌జేయాల‌ని అభిమానులు కోరుతున్నారు. మ‌రీ ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Also Read : 

గోవిందా గోవిందా, శుభలగ్నం సినిమాలకి మధ్య ఇలాంటి సంబంధం ఉందా..?

Chanakya Niti : మ‌గ‌వాడి జీవితాన్ని ఈ 4 ప‌రిస్థితులు విచారంగా మారుస్తాయ‌ట‌..!

Visitors Are Also Reading