తెలుగు చిత్రసీమకు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ రెండు కండ్ల లాంటి వాళ్లు. ఏఎన్ఆర్ లవర్ బాయ్ గా ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తే ఎన్టీఆర్ పౌరాణిక జానపద చిత్రాలతో అభిమానులను సంపాదించుకున్నారు. అక్కినేని కేవలం ప్రేమకథా చిత్రాలకే పరిమితం కాకుండా అన్ని రకాల సినిమాలు చేశారు కానీ ఆయనకు మన్మథుడిగానే ముద్రపడిపోయింది. అదే విధంగా ఎన్టీఆర్ కూడా పౌరాణిక చిత్రాలే కాకుండా అన్ని రకాల పాత్రలలో నటించారు కానీ ఆయన పౌరాణిక చిత్రాలకు బ్రాండ్ గా మారిపోయారు.
Advertisement
ఇక సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండేవారు. అదే విధంగా వీరిద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ కూడా ఉండేది. కలెక్షన్స్ విషయంలోనూ సినిమా విడుదల విషయంలోనూ ఇద్దరూ పోటీ పడేవారు. అదేవిధంగా స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాలు రావడం చాలా అరుదు కానీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్ లో ఏకంగా పదిహేను మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి.
Advertisement
కలిసి ఉండే వీళ్ల మధ్య ఒకానొక సంధర్బంలో మనస్పర్దలు కూడా తలెత్తాయి. తన సినిమాలో కృష్ణుడి వేషం వేయాలని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ను కోరారట. కానీ ఏఎన్ఆర్ మాత్రం ఆ పాత్రలో నటించకుండా రిజెక్ట్ చేశారట. ఆ ఒక్కమాట అడగకండి మహాప్రభో అంటూ తిరస్కరించారట. ఎన్టీఆర్ అప్పటి సీఎం జలగం వెంగళరావుతో ఏఎన్ఆర్ ను నటించాలని చెప్పాలని కోరారట.
సీఎం రికమెండ్ చేసినప్పటికీ ఏఎన్ఆర్ మాత్రం తగ్గకుండా కృష్ణుడి పాత్రలో నటించలేదట. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాలు రాలేదు. ఇద్దరూ కూడా కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత సినారే గారు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినారే ఎన్టీఆర్ సినిమాలకు పాటలు రాయడంతో ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండేవి.
ALSO READ : ఆదిత్య 369 నుండి “బింబిసార” వరకు వచ్చిన టైం ట్రావెల్స్ సినిమాలు…వాటి రిజల్ట్స్ ఇవే…!