Home » ఆరెంజ్, జోష్ సినిమాల్లో న‌టించి ఇప్పుడు స్టార్ గా మారిన ఈ హీరోను గుర్తుప‌ట్టారా..!

ఆరెంజ్, జోష్ సినిమాల్లో న‌టించి ఇప్పుడు స్టార్ గా మారిన ఈ హీరోను గుర్తుప‌ట్టారా..!

by AJAY
Ad

కొంత‌మంది హీరోలు స్టార్ హీరోల వార‌సులుగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ ను అందుకుంటే కొంత‌మంది హీరోలు మాత్రం ఇండ‌స్ట్రీలో ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు. అంచెలంచెలుగా ఎదిగి హీరోలుగా స‌క్సెస్ అవుతారు. కెరీర్ ప్రారంభంలో సినిమాల‌లో హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ లు ఇత‌ర పాత్ర‌లు కూడా చేస్తుంటారు. అలా టాలీవుడ్ లో స‌క్సెస్ ను అందుకున్న హీరోల‌లో ర‌వితేజ‌, నాని, రాజ్ త‌రుణ్ తో పాటూ మ‌రికొంత‌మంది హీరోలు ఉన్నారు.

Advertisement

రీసెంట్ గా ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోలుగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, న‌వీన్ పొలిశెట్టి కూడా కెరీర్ లో ఎంతో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చారు. ఇదిలా ఉండ‌గా రీసెంట్ గా డీజే టిల్లు సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న సిద్దు జొన్న‌గ‌డ్డ‌ల కూడా ఇండ‌స్ట్రీలో ఎంతో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాడు. కెరీర్ ప్రారంభం లో సిద్దు సినిమాల‌లో సైడ్ పాత్ర‌లు సైతం చేశాడు.

Advertisement

నాగ‌చైన‌త్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన జోష్ సినిమాలో సిద్దు నెగిటివ్ రోల్ లో క‌నిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఆరెంజ్ సినిమాలో కూడా సిద్దు జొన్నగ‌డ్డ‌ల నటించాడు. ఈ సినిమాలో జ‌నీలియా ప్రేమించే ముగ్గురిలో ఒక‌రిగా సిద్దు జొన్న‌గ‌డ్డ‌ల క‌నిపించారు. ఈ సినిమా కూడా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు.

ఇదిలా ఉండ‌గానే సిద్దు జొన్న గ‌డ్డ‌ల గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమాతో సిద్దు కంటే ర‌ష్మి కే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఈ సినిమా త‌రవాత రీసెంట్ గా లాక్ డౌన్ లో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ రెండు సినిమాల‌కు మంచి గుర్తింపు రావ‌డంతో ఓటీటీ స్టార్ గా సిద్దు మారిపోయాడు. ఇక రీసెంట్ గా సిద్దు జొన్న‌గ‌డ్డ‌ల డీజే టిల్లు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో సిద్దు జొన్న‌గ‌డ్డ‌ల ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిపోయాడు.

Visitors Are Also Reading