Home » టీ-20 ర్యాకింగ్స్‌ టాప్ 20లోకి శ్రేయాస్ అయ్యర్

టీ-20 ర్యాకింగ్స్‌ టాప్ 20లోకి శ్రేయాస్ అయ్యర్

by Anji
Ad

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో శ్రేయాస్ అయ్య‌ర్ టాప్ 20లోకి చేరాడు. శ్రీ‌లంక‌తో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ 18వ స్థానానికి చేరుకున్నాడు. మ‌రొక‌వైపు టాప్‌-10లో మాజ కెప్టెన్ విరాట్ కోహ్లీస్థానం కోల్పోయాడు. శ్రీ‌లంక‌తో సిరీస్‌లో ఆడ‌లేదు. కోహ్లీ 10వ స్థానం నుంచి 15వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 సిరీస్‌లో భార‌త్ 3-0 శ్రీ‌లంక‌ను ఓడించింది. ఈ సిరీస్‌లో శ్రేయాస్ అయ్య‌ర్ 174స్ట్రైక్ రేట్‌తో 204 ప‌రుగులు చేశాడు.

Advertisement

మ‌రొక వైపు బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్‌కుమార్ మూడు స్థానాలు ఎగ‌బాకాడు. అత‌ను ఇప్పుడు 17వ ర్యాంకులో ఉన్నారు. సిరీస్‌లో శ్రీ‌లంక ఆట‌గాడు పాతుమ్ నిసంక 75 ప‌రుగులు చేశాడు. దీంతో ఆరు స్థానాలు ఎగ‌బాకి తొమ్మిదవ స్థానానికి చేరుకున్నాడు. శ్రీ‌లంక‌కు చెందిన ల‌హిరు కుమార తొలిసారిగా టాప్‌-40 బౌల‌ర్ల‌లోకి ప్ర‌వేశించాడు. ద‌క్షిణాఫ్రికా ఫాస్ట్ బౌల‌ర్ క‌గిసో ర‌బాడ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగ‌బాకి మూడ‌వ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ర‌బాడ 10 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జేమీసన్ ఐదవ‌ స్థానానికి, టిమ్ సౌథీ ఆరవ‌ స్థానానికి పడిపోయారు.

Advertisement

ఇక వ‌న్డే ర్యాంకింగ్స్‌ల‌లో బంగ్లాదేశ్‌తో ఇటీవ‌ల జ‌రిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ త‌రువాత అప్ఘ‌నిస్తాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ టాప్ 10 బౌల‌ర్ల జాబితాలో త‌న స్థానాన్ని తిరిగి పొందాడు. అత‌ను ఆరు స్థానాలు ఎగ‌బాకి తొమ్మిదో ర్యాంకులో ఉండా.. బంగ్లాదేశ్‌కు చెందిన మెహ‌దీ హాస‌న్ మిరాజ్ ఏడ‌వ స్థానానికి ప‌డిపోయాడు. వ‌న్డేల‌లో ట్రెంట్ బౌల్ట్ అగ్ర‌స్థానంలోఉండ‌గా.. బ్యాట్స్‌మెన్ లో పాకిస్తాన్‌కు చెందిన బాబ‌ర్ అజ‌మ్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు.

Also Read :  ఏపీలో ఎల్లుండి నుంచి భారీ వ‌ర్షాలు..ఆ జిల్లాల‌కు అల‌ర్ట్‌..!

Visitors Are Also Reading