విరాట్ కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మను ఆ స్థానంలో నియమించింది బీసీసీఐ. అయితే రోహిత్ ఈ మధ్యే కెప్టెన్ గా పగ్గాలు చేప్పట్టిన అప్పటి నుండే తర్వాతి కెప్టెన్ ఎవరు అనే చర్చ అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ చర్చలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మొదట్లో ఈ స్థానంలో విరాట్ కోహ్లీ వారసుడిగా కేవలం ఒక్కే పేరు వినిపించేది. అదే శ్రేయర్ అయ్యర్. అయితే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అయ్యర్ అద్భుతాలు చేసాడు. ఆ జట్టును 2020 లో మొదటిసారి ఫైనల్స్ కు తీసుకెళ్లాడు. దాంతో భారత భవిష్యత్ కెప్టెన్ అతనే అనుకున్నారు.
Advertisement
కానీ ఈ ఐపీఎల్ 2020 తర్వాత ఇంగ్లాండ్ తో ఇండియాలో జరిగిన ఒక్క సిరీస్ అతని జీవితాన్ని మార్చేసింది. ఈ సిరీస్ వరకు కెప్టెన్ గా అయ్యర్ పేరు బాగా వినబడింది. కానీ ఇందులో గాయపడి.. మూడు నెలలు ఆటకు దూరమయ్యాడు. అప్పుడు ఢిల్లీ కెప్టెన్ గా రిషబ్ పంత్ పగ్గాలు అందుకున్నాడు. అయ్యర్ వచ్చినా కూడా అతనికే ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్సీ ఇవ్వడంతో ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు వెళ్ళాడు. కానీ అక్కడ ఈ ఏడాది ఐపీఎల్ లో కెప్టెన్ గా అంతగా సక్సెస్ కాలేదు. దాంతో కెప్టెన్సీ రేసులో అయ్యర్ చివరి స్థానానికి పడిపోయాడు.
Advertisement
కానీ అయ్యర్ కెప్టెన్ గా అద్భుతాలు చేయగలడు అని అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్. తాజాగా స్కాట్ స్టైరిస్ మాట్లాడుతూ.. అయ్యర్ గొప్ప కెప్టెన్ కాగలడు. అతనిలో కెప్టెన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. అతడిని జట్టుకు కెప్టెన్ ను చేసి సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు చేయగలడు. ఇక అయ్యర్ కు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. కానీ అతనికి అవకాశాలు అనేవి ఇస్తే.. తన లోపాలను అయ్యర్ సరిదిద్దుకోగలడు. అతను ఒక్క నిజమైన కెప్టెన్ అని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :