Home » ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ ఎన్ని కోట్లు ఛార్జ్ చేస్తాడో తెలుసా..?

ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ ఎన్ని కోట్లు ఛార్జ్ చేస్తాడో తెలుసా..?

by Azhar
Ad

భారత జట్టు మాజీ కెప్టెన్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నాడో అందరికి తెలుసు. క్రికెట్ ప్రపంచంలో పరుగుల రారాజుగా ఎదిగిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు పరుగులు చేయడానికి తంటాలు పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అలవోకగా 70 సెంచరీలు అనేవి బాదిన విరాట్ కోహ్లీ… ఇప్పుడు 71వ సెంచరీ చేయడానికి మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాడు. కోహ్లీ ఆఖరి సెంచరీ 2019 లో బంగ్లాదేశ్ పైన చేసాడు. అప్పటి నుండి ఇప్పటివరకు మళ్ళీ మూడెంకల స్కోర్ ను కోహ్లీ అందుకోలేపోతున్నారు.

Advertisement

అయితే విరాట్ కోహ్లీ తనకు ఉన్న క్రేజ్ ను ఎలా క్యాష్ చేసుకుంటాడో అందరికి తెలుసు. ఫేమ్ లో ఉన్నప్పుడు ఒక్కో యాడ్ కోసం కోహ్లీ కోట్లలో తీసుకునేవాడు. అయితే ఇప్పుడు ఫేమ్ లో లేకపోయినా ఈ విషయంలో విరాట్ వెన్నకి తగ్గడం లేదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక్కో ఇంస్టా పోస్ట్ కు ఎంత తీసుకుంటాడు అనేది పెద్ద చర్చగా మారింది. అయితే విరాట్ కోహ్లీకి ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో 209 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. మొత్తం ఆసియా కంటినేట్ లోనే అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న వ్యక్తిగా విరాట్ ముందువరుసలో ఉన్నాడు.

Advertisement

ఇక ఇంతమంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు.. ఈ అకౌంట్ ద్వారా కూడా డబ్బులు అనేవి బాగానే సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కో ఇంస్టా పోస్ట్ కు 8.69 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ ఆధార్ షాక్ లోకి వెళ్లారు అనే చెప్పాలి. అయితే పరుగులు చేయకపోవడంతో క్రేజ్ అనేది విరాట్ కు తగ్గింది అనుకునే వాళ్ళు కూడా కోహ్లీకి ఒక్కో పోస్ట్ కు వస్తున్న ఈ అమౌంట్ ను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇక ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న విరాట్ కోహ్లీ… తన ఫామ్ ను మళ్ళీ పొందే పనిలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి :

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డ్యాన్స్ మీరు చూశారా..? సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

స్పాన్సర్లతో చుక్కలు చూస్తున్న బీసీసీఐ..!

Visitors Are Also Reading