మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రీసెంట్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి మూడున మనోజ్ తన ప్రియురాలు మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రుడు మరియు రాజకీయ సినీ ప్రముఖులు వీరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరిద్దరికీ ఇది రెండో వివాహం అన్న సంగతి చాలా మందికి తెలియదు. మనోజ్ కు మొదట ఓ యువతతో వివాహం అయ్యింది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.
READ ALSO : గురువారం రోజు మహిళలు అస్సలు చేయకూడని పనులు !
Advertisement
అంతేకాకుండా భూమా మౌనిక రెడ్డికి ఇప్పటికే వివాహం కాగా, ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మౌనికది పొలిటికల్ బ్యాగ్రౌండ్. దీంతో మౌనిక పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉండొచ్చు అని చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మరి మంచు మౌనిక రెడ్డి ఏ పార్టీలో చేరుతారు అనేది తెలియాల్సి ఉంది. అక్క అఖిల టిడిపిలో ఉంది కాబట్టి చెల్లి మౌనిక కూడా ఆ పార్టీలోనే చేరుతుందని అనుకోలేమని అంటున్నారు. ఎందుకంటే మంచు ఫ్యామిలీది వైసీపీ పార్టీ.
Advertisement
READ ALSO : చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?
చేరితే, గీరితే మంచు మౌనిక వైసిపిలోనే చేరాల్సి ఉంటుం దనే చర్చ నడుస్తుంది. భూమా కుటుంబం సైతం గతంలో వైఎస్ఆర్సిపిలోనే ఉండేది. వైఎస్ కుటుంబ అభిమానులుగానే ఉన్నారు. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో టిడిపిలో చేరారు. అయితే ఇప్పుడు కూడా మంచు కుటుంబం అడుగుజాడల్లోనే మౌనిక నడిచి వైసిపి తీర్థం పుచ్చుకుంటుందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే అఖిలప్రియకు షాక్ తగలనుంది.
READ ALSO : ఈ 3 లక్షణాలున్న మహిళ భార్యగా వస్తే… భర్త అదృష్టవంతుడే!