ఎన్టీఆర్ సినిమా రంగంలోనే కాకండా రాజకీయ రంగంలో కూడా తిరుగులేని నేతగా ఎదిగారు. ఎన్టీఆర్ తన ప్రతిభను చాటుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ కలిగిన నటుడు, పదిమందికి క్రమశిక్షణ నేర్పిన నటుడిగా సీనియర్ ఎన్టీఆర్‌కు పేరుంది. రాముడు, కృష్ణుడు వంటి పాత్రలతో ఆకట్టుకున్నారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మూడు షిఫ్టుల్లో పనిచేశారు. అంతటి బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆహారశైలి ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పటికీ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఉదయం సమయంలో ఎన్టీఆర్ ఆరచేతి మందంలో సుమారు 20 ఇడ్లీలను తినేస్తారట. మేకప్ వేసుకొని నిర్మాతలతో కలిసి షూటింగ్ స్పాట్‌కు వెళ్లేవారు. షాట్‌గ్యాప్‌లో ఆపిల్ జ్యూస్ తాగేవారట. ఎన్టీఆర్‌కు ఆపిల్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అని సన్నిహితులు చెబుతుంటారు. రోజుకు కనీసం 5 బాటిల్స్ ఆపిల్ జ్యూస్ ఉండాల్సిందే.
Advertisement
Advertisement
అదేవిధంగా, సాయంత్రం సమయంలో స్నాక్స్ కింద బజ్జీలు తినడం అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. అలానే డ్రైఫ్రూట్స్ తినేందుకు ఎన్టీఆర్ ఆసక్తి చూపేవారు. వీటితో పాటుగా రోజులో రెండు లీటర్ల బాదంపాలు తప్పనిసరి. ఎండాకాలమైతే మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మ్యాంగో జ్యూస్ ఉండాల్సిందే.
అందులో గ్లూకోస్ వేసుకొని తాగడం అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. ఎంత ఆహారం తీసుకున్నా ఆయన చేసే పనుల కారణంగా ఆహారం ఈజీగా అరిగిపోతుందని ఆయన సన్నిహితులు చెబుతుండేవారు. 300 లకు పైగా సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ ఒప్పుకున్న సినిమాలు వేగంగా పూర్తి చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునేవారని ఎన్టీఆర్ సన్నిహితులు పేర్కొన్నారు.
Also Read:
యాంకర్ సుమ చేతి పై పచ్చబొట్టు…..ఆ పేరు ఎవరిది..?
గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేస్తే ఇలా జరుగుతుందా..!!