Home » గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేస్తే ఇలా జరుగుతుందా..!!

గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేస్తే ఇలా జరుగుతుందా..!!

Ad

మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మనిషి పుట్టిన నాటినుంచీ మొదలు చనిపోయిన తర్వాత కూడా వివిధ రకాల సంప్రదాయాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మహిళ గర్భం దాల్చినప్పుడు ఆమెకు శ్రీమంతం చేస్తారు మరి ఆ సీమంతం గర్భిణీ స్త్రీలకు ఎందుకు చేస్తారు.. దాని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటో.. చూద్దాం..!! సాధారణంగా గర్భిణీ స్త్రీలకు 7 నెలలో కానీ, 9 నెలలో కానీ శ్రీమంత కార్యక్రమం చేస్తారు. దీని ప్రధాన ఉద్దేశం శిశువు కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రాణశక్తి ఉన్నాకానీ, అట్టి శిశువు ఏడవనెలకి వచ్చేసరికి చైతన్య శక్తి కూడా వస్తుంది. కడుపులో ఉన్న పాపకు కొన్ని కొన్ని విషయాలు తెలియడం ప్రారంభమవుతుంది.

కాబట్టి ఆ సమయంలో శ్రీమంతం చేస్తారు. సీమంతం చేసే రోజు గర్భిణీ స్త్రీలను చక్కగా మంగళ స్నానం ఆచరించి, జుట్టు సామ్రాణితో ఆరబెట్టి, నుదుట కుంకుమ, కాళ్ళకి పసుపు తలనిండా పూల ను ధరించి కొత్త చీర కట్టి కూర్చో పెడతారు. కొన్ని ప్రాంతాల్లో హోమాలు చేసే ఆనవాయితీ కూడా ఉంటుంది. ఆడవాళ్ళంతా వచ్చి గర్భిణీ స్త్రీకి కొత్త గాజులు, గంధం రాసి కానుకలు సమర్పిస్తారు. ముఖ్యంగా తినుబండారాలు కొత్త బట్టలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డ చాలా సంతోషంగా ఉంచే ప్రయత్నంలో భాగం అన్నమాట. ఆ తర్వాత మంగళ హారతి ఇస్తారు.

Advertisement

Advertisement

ఇలా ఎందుకు చేస్తారంటే ప్రసవానికి ముందు గర్భిణీ స్త్రీ మానసికంగా గట్టిగా తయారు కావడం కోసం ఈ సీమంతం చేస్తారని తెలుస్తోంది. చాలామంది ముత్తయిదువలు చూసి ఆమెకు భయం తగ్గుతుంది. ఎందుకంటే అంతమంది ముత్తయిదువలు వారి పిల్లలను కనీ చాలా హాయి గా ఉన్నారని, నాకు కూడా ఏమీ కాదని మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు. అందుకే ఈ సీమంత ప్రక్రియను చేస్తారు. ఇది ఒక రకమైన సైంటిఫిక్ రీజన్.. అయితే మన పురాణం నుంచి అనేక కథలు శ్రీమంతం గురించి ఉన్నాయి.

ALSO READ;

అందరూ అలా చూసేవాళ్ళే అంటూ నోరూరిస్తున్న శ్రీరెడ్డి…వీడియో వైరల్…!

యాంకర్ సుమ చేతి పై పచ్చబొట్టు…..ఆ పేరు ఎవరిది..?

 

Visitors Are Also Reading