Home » నందమూరి రామకృష్ణ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..!

నందమూరి రామకృష్ణ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..!

by Bunty
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. దాదాపు 6 దశాబ్దాలకు పైగానే ఈ ఫ్యామిలీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికే మూడోతరం హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే ఇవాళ నందమూరి రామకృష్ణ గురించి బయటి ప్రపంచానికి తెలియని నిజాలు తెలుసుకుందాం. నందమూరి తారకరామారావు చివరి కొడుకు అయిన నందమూరి రామకృష్ణ. ఎన్టీఆర్ మొదటి కుమారుడు రామకృష్ణ మరణించిన తర్వాత ఏడవ సంతానంగా పుట్టిన కొడుకుకి రామకృష్ణ అని పేరు పెట్టుకున్నారు.  చిన్నప్పటి నుండి చదువులోనూ ఆటలోను చురుగ్గా ఉండే రామకృష్ణ బ్యాడ్మింటన్ అలాగే టెన్నిస్ బాల్ ప్లేయర్.

Advertisement

చిన్నతనం నుండి ఆ పోటీలు ఎక్కడ నిర్వహించిన వెళ్లేవారట. ఇక అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగంలో మంచి జీతానికి పనిచేస్తూ ఉన్న రామకృష్ణ ఆఫీసులో తన సహచరినే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్కడే స్థిరపడిన రామకృష్ణ తల్లి మరణం తర్వాత కృంగిపోతున్న తండ్రి కోసం ఉద్యోగం వదిలి హైదరాబాద్ వచ్చేసారట. ఇక రామకృష్ణ స్టూడియో బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించడంలో రామకృష్ణ గారి పాత్ర ఎంతైనా ఉంది. ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను ఆ బ్యానర్ లోనే రామకృష్ణ నిర్మించారు.

Advertisement

ఇక తండ్రి మరణించిన తర్వాత బాలకృష్ణ హీరోగా పెద్దన్నయ్య సినిమాను మోహనకృష్ణ సినిమాటోగ్రఫీలో తీసి మేము కలిసే ఉన్నాము అన్నట్లు ప్రపంచానికి చెప్పారు. ఒకానొక సమయంలో రామకృష్ణ గారికి ఆక్సిడెంట్ అవ్వడంతో తలకు బాగా గాయమై తలలో రక్తస్రావం ఎక్కువ అవ్వడం వల్ల చాలా సీరియస్ అయింది. ఆయన కోలుకున్నప్పటికీ ఒక చేతిని ఒక కాలిని పూర్తిగా కదపలేరట. ఇక మోహన్ కృష్ణ కొడుకు తారకరత్న హీరోగా యువరత్న అనే సినిమాను నిర్మించిన రామకృష్ణ గారు ఆ సినిమా మొదట్లో హరికృష్ణతో చివర్లో బాలకృష్ణతో వాయిస్ ఓవర్ ఇప్పించడం విశేషం.

READ ALSO : ప్రయాణికులకు అలర్ట్… హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు…వివరాలు ఇవే

Visitors Are Also Reading