టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొంతమంది తెలుగు హీరోయిన్లు అయితే… మరి కొంతమంది తమిళ్, మలయాళం నుంచి కూడా వస్తారు. ఇక కొంతమంది ముంబై, బాలుడు చిత్ర పరిశ్రమ నుంచి కూడా వస్తారు. అలా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత ధూళిపాళ. శోభిత ధూళిపాళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హిందీలో సినిమాలు ఎక్కువ చేసిన తెలుగులో బాగా పాపులారిటీ తెచ్చుకుంది బ్యూటీ.
Advertisement
అడవి శేషు హీరోగా చేసిన గూడచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత అదే హీరోతో మేజర్ సినిమా కూడా చేసింది శోభిత ధూళిపాళ. ఇక ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా నటించి అందరిని మెప్పించింది శోభిత ధూళిపాళ. అయినప్పటికీ ఈ బ్యూటీ కి తెలుగులో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. దీంతో తన అందాల ఆరబోతను కూడా మొదలు పెట్టేసింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ… అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత ఇష్యూలోకి ఎంటర్ అయింది.
Advertisement
మొన్నటి వరకు నాగచైతన్యతో… శోభిత ఎఫ్ఐర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా…సమంత, నాగచైతన్య గురించి హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘సమంత చాలా కూల్ గా అనిపిస్తుంది. ఆమె మూవీ ప్రాజెక్టులను డీల్ చేసే విధానం బాగుంటుంది. ఇక చైతన్య చాలా సైలెంట్. ఎంతో ఒద్దికగా ఉంటాడు. ఆయన స్వభావాన్ని మెచ్చుకోవాల్సిందే’ అని అన్నారు. కాగా, సామ్, చైతు విడాకుల నాటి నుంచి శోభిత, చైతు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రాగా గతంలో శోభిత వీటిని ఖండించారు.
ఇవి కూడా చదవండి
సొంతంగా విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో తెలుసా?
టాలీవుడ్ హీరోలకు భార్యలుగా ఇంతమంది రెడ్డి అమ్మాయిలా…!
Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకుంటే.. ఖచ్చితంగా ధనవంతులవుతారట..!