టాలీవుడ్ లోని లెజండరీ దర్శకులలో రాఘవేంద్రరావు కూడా ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు రాఘవేంద్రటాలీవుడ్ లోని లెజండరీ దర్శకులలో రాఘవేంద్రరావు కూడా ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.రావు దర్శకత్వం వహించారు. స్టార్ హీరోలతో రాఘవేంద్రరావు సినిమాలు చేశారు. రొమాంటిక్ సినిమాలు పాటలు అంటే రాఘవేంద్రరావే గుర్తుకు వచ్చేవారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ రాఘవేంద్రరావు సినిమాలకు దర్శకత్వం వహించారు. కేవలం సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాలను నిర్మించారు కూడా.
Advertisement
ఇదిలా ఉండగా రాఘవేంద్రరావు సోగ్గాడు శోభన్ బాబుతో ఏడు సినిమాలను తెరకెక్కించారు. మొదటగా 1975లో శోభన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు బాబు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తరవాత వీరిద్దరి కాంబినేషన్ లోనే మోసగాడు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి నెగిటివ్ రోల్ లో నటించారు. అప్పటికి చిరంజీవి రెండు మూడు సినిమాల్లోనే నటించాడు. అంతే కాకుండా ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తూ వెళ్లిపోయారు.
Advertisement
కానీ చిరంజీవి మంచి అందగాడు అని నటుడు అని ఇండస్ట్రీలో అప్పటికే టాక్ ఉంది. అయితే ఈ విషయంలో శోభన్ బాబు కంగారు పడ్డారట. ఈ విషయాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శోభన్ బాబు నేరుగా తన వద్దకు వచ్చి చిరంజీవి మంచి డ్యాన్సర్ , ఫైట్స్ చేస్తాడని తెలుసు సినిమాలో శ్రీదేవితో స్టెప్పులు వేస్తాడు అలాంటప్పుడు తనను ఎవరు చూస్తారని శోభన్ బాబు రాఘవేంద్రరావును అడిగారట.
దాంతో రాఘవేంద్రరావు నవ్వుతూ అది విలన్ పాత్ర మీది హీరో పాత్ర చిరంజీవి పాత్ర ప్రభావం మీపై ఏ మాత్రం పడదు అని భరోసా ఇచ్చారట. రాఘవేంద్రరావు అలా చెప్పడంతో మెగాస్టార్ కూడా కన్విన్స్ అయ్యారట. ఇక మోసగాడు సినిమా తరవాత చిరంజీవికి కూడా క్రేజ్ వచ్చింది. హీరోగా సైతం ఆఫర్ లను అందుకున్నారు.