Home » ఉమ్రాన్ పై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఉమ్రాన్ పై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో అందర్నీ ఆకర్షిస్తున్న బౌలర్ ఉమ్రాన్ మాలిక్. గత ఏడాది సన్ రైజర్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన మాలిక్.. ఈ ఏడాది ఆ జట్టుకు ముఖ్యమైన బౌలర్ గా మారాడు. ప్రతి మ్యాచ్ లో 150 కీ.మీ వేగంతో బంతులను విసిరే ఉమ్రాన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు.. తనను వెంటనే టీం ఇండియాలోకి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం అతడిని జాగ్రత్తగా వాడుకోవాలి అంటున్నారు.

Advertisement

అయితే ప్రపంచ క్రికెట్ చరిత్రలో అంత్యంత వేగమైన బంతిని షోయబ్ అక్తర్ విసిరాడు. 161.3 కిలోమీటర్ల వేగంతో ఆ బంతిని అక్తర్ విసిరాడు. కానీ దానిని ఉమ్రాన్ మాలిక్ బ్రేక్ చేస్తాడు అని చాల మంది అన్నారు. ఈ క్రమంలో మాలిక్ బౌలింగ్ పై అక్తర్ మాట్లాడుతూ… ఉమ్రాన్ మాంచి వెంగంతో బంతులు వేస్తున్నాడు. అతడు ఇంకా చాల ఏళ్ళు ఈ క్రికెట్ లో కొనసాగాలని అనుకుంటున్నాను. అయితే ఈ మధ్యే నేను అత్యంత వేగవంతమైన బాల్ విసిరి 20 ఏళ్ళు అయిందని నాకు శుభాకాంక్షలు చెబుతూ చాల మంది మెసేజ్ పెట్టారు. ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు అన్నారు. కానీ నేను మాత్రం ప్రతి రికార్డును బ్రేక్ చేయడానికి ఎవరో ఒక్కరు ఉంటారు అని చెప్పను.

Advertisement

ఇప్పుడు ఉమ్రాన్ బౌలింగ్ ను చూస్తుంటే అది అతనే అవుతాడు అని అనిపిస్తుంది. నిజంగా ఉమ్రాన్ నా రికార్డును బ్రేక్ చేస్తే నేను సంతోషిస్తాను. కానీ అందుకోసం అతను గాయాలపాలు కాకూడదు అని నేను కోరుకుంటున్నారు. ఉమ్రాన్ ప్రపంఞ్చ క్రికెట్ లో కూడా ఇదే విధంగా తన ప్రతిభను చూపించాలి అని అక్తర్ తెలిపాడు. అయితే ఉమ్రాన్ ఇప్పటివరకు ఐపీఎల్ వేసిన అత్యంత వేగవంతమైన బంతి 157 కీ.మీ గా ఉంది. చూడాలి మరి మాలిక్ ఆ రికార్డును బ్రేక్ చేస్తాడా.. అనేది.

ఇవి కూడా చదవండి :

చెన్నై గుజరాత్ విజయం.. క్వాలిఫైర్ 1 బెర్త్ ఖాయం..!

బెంగళూరు ఓటమిని పిల్లి పైన తోసేస్తున్నా ఫ్యాన్స్..!

Visitors Are Also Reading