Home » చెన్నై గుజరాత్ విజయం.. క్వాలిఫైర్ 1 బెర్త్ ఖాయం..!

చెన్నై గుజరాత్ విజయం.. క్వాలిఫైర్ 1 బెర్త్ ఖాయం..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో ఈరోజు వీకెండ్ సందర్భంగా రెండు మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ పైన పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే ఈ రెండు జట్లలో గుజరాత్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకోగా… చెన్నై అధికారికంగా ప్లే ఆఫ్స్ నుండి తప్పుకుంది. అందువల్ల ఈ మ్యాచ్ లో రిజల్ట్ ఎలా అది పెద్దగా ప్రభావం చూపించదు.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై జట్టులో బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేదు. ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ (53) ఒక్కడే అర్ధశతకం చేయగా.. మిగిలిన వారందరు విఫలమయ్యారు. జగదీశన్ (39), మొయిన్ అలీ (21) పర్వాలేదు అనిపించడంలో చెన్నై నియనిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దాంతో గుజరాత్ జట్టు ముందు స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది.

Advertisement

ఇక 134 పరుగుల లక్ష్యంతో వచ్చిన గుజరాత్ జట్టులో ఓపెనర్ గిల్ 18 పరుగులు చేసే పెవిలియన్ చేరుకున్నాడు. కానీ మరో ఓపెనర్ సాహా మాత్రం రాణించాడు. 57 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును విజయం వైపుకు నడిపించాడు. మాథ్యూ వేడ్ 20 పరుగులు చేయగా… కెప్టెన్ హార్దిక్ పాండ్య మాత్రం కేవలం 7 పరుగులే చేసి నిరాశ పరిచాడు. అనంతరం వచ్చిన మిల్లర్ 15 పరుగులు చేసి జట్టును విజయ తీరాలు దాటించాడు. అయితే ఈ విజయం గుజరాత్ కు ఈ సీజన్ లో 10వ విజయం. దాంతో 20 పాయింట్లతో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న గుజరాత్… టాప్ 2 ప్లేస్ ను కూడా పక్క చేసుకుంది. దాంతో గుజరాత్ క్వాలిఫైర్ 1 లో మరో జట్టుతో పోటీ పడుతుంది.

ఇవి కూడా చదవండి :

దినేష్ కార్తీక్ ప్రపంచ కప్ ఆడాలి…!

బెంగళూరు ఓటమిని పిల్లి పైన తోసేస్తున్నా ఫ్యాన్స్..!

Visitors Are Also Reading