భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో నెలకొల్పిన స్థాయి గురించి అందరికి తెలిసిందే. అలవోకగా సెంచరీల మీద సెంచరీలు చేసే విరాట్ ను చూసి ఇతను సచిన్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ గత రెండున్నరేళ్లుగా కోహ్లీ ఒక్క శతకం కూడా చేయలేదు. అలాగే పరుగులు చేయడంలో కూడా తడబడుతున్నాడు. దాంతో కోహ్లీ పై విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2022 లో కూడా కోహ్లీ రాణించలేకపోయాడు. ఆడిన 16 మ్యాచ్ లలో కేవలం 115.99 స్ట్రైక్ రేట్ తో 341 పరుగులే చేసాడు. దాంతో కోహ్లీని అభిమానులతో పాటుగా భారత మాజీ ఆటగాళ్లు కూడా విమర్శించారు.
Advertisement
కానీ కోహ్లీకి ఇపుడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అండగా నిలిచాడు. మీరు కోహ్లీకి కనీసం గౌరవడం ఇవండీ అంటూ విమర్శకులకు సూచించాడు. కోహ్లీ ఎలాంటి ఆటగాడో అందరికి తెలుసు. నేను ఓ పాకిస్థాన్ ఆటగాడిగా చెబుతున్న ఇండియన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్లేయర్. ఆల్ టైమ్ బెస్ట్ ఆటగాడు. అతను కనీసం 45 ఎల్లా వరకు క్రికెట్ ఆడాలి. 110 సెంచరీలు చేయాలి అని తాను కోరుకుంటున్నట్లు అక్తర్ అన్నారు. అలాగే ఈ పరిస్థితులను చూసి భయపడకుండా.. వారి నుండి భరింత బలంగా మరి బయటికి రావాలి అని తెలిపాడు.
Advertisement
అలాగే ఇప్పుడు కోహ్లీ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసే విమర్శించేలా ఉన్నారు కొంతమంది. నువ్వు బాగా ఆడకపోతే ని ఫ్యామిలీని తిడుతున్నవారు కూడా ఉన్నారు. కానీ వీటికి బెదిరిపోకుండా అందులో నుండి బయటకు వచ్చి కోహ్లీ ఎవరో మరోసారి ప్రపంచాన్ని పరిచయం చెయ్ అంటూ అక్తర్ అన్నారు. అలాగే విమర్శకులు కూడా తమను ప్రపంచం చూస్తుంది.. చిన్నపిల్లలు చూస్తున్నారు అని గుర్తుంచుకోవాలి. కోహ్లీ గురించి మంచిగా చేప్పాలి. మీరందరు సచిన్ ను చూసి నేర్చుకోండి. సచిన్ ఎటువంటి సమయంలోనైనా ఎవరిని విమర్శించడు అని అక్తర్ గుర్తు చేసాడు.
ఇవి కూడా చదవండి :