Home » నేను ఆడితే భారత్ ప్రపంచ కప్ గెలిచేది కాదు..!

నేను ఆడితే భారత్ ప్రపంచ కప్ గెలిచేది కాదు..!

by Azhar
Ad
కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు 1983 లో మొదటిసారి ప్రపంచ కప్ లో విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా అప్పుడు టైటిల్ అందుకున్న టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ ను ముద్దాడటానికి 28 ఏళ్ళు పట్టింది. 1983 తర్వాత 2011 లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ను ధోని కెప్టెన్సీలో భారత జట్టు అందుకుంది. అయితే ఈ ప్రపంచ కప్ టీం ఇండియా గెలిచేది కాదు అని పాకిస్థాన్ మాజీ ఆటగాడి షోయబ్ అక్తర్ అంటున్నాడు.
అయితే తాజాగా అక్తర్ మాట్లాడుతూ.. 2011 ప్రపంచ లో భారత్ – పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్ 2 లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ కు వేల సంఖ్యలో అభిమానులతో పాటుగా రెండు దేశాల ప్రధాన మంత్రులు కూడా హాజరు అయ్యారు. కానీ ఇందులో ఇండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి చవి చూసింది. కానీ నేను ఎప్పుడు జట్టులో ఉంటె ఇండియా ఓడిపోయేదని.. ఫైనల్ లో శ్రీలంకతో తమ పాకిస్థాన్ తలపడేదని అక్తర్ అంటున్నాడు. అయితే ఈ మ్యాచ్ నేను ఉండాల్సింది కానీ.. నేను మ్యాచ్ కోసం ఫిట్ గా లేను అని మేనేజ్మెంట్ నను పక్కకు పెట్టింది.
అప్పటి జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి. నేను ఈ మ్యాచ్ లో ఉంటె సచిన్, సెహ్వాగ్ లను ముందే ఔట్ చేసేవాడిని. అప్పుడు ఆ జట్టు ఎక్కువ పరుగులయు చేసేది కాదు అన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో వారిద్దరే అర్ధశతకాలు చేసి జట్టుకు పరుగులు జోడించారు. మాతో స్వదేశంలో మ్యాచ్ కాబట్టి ఒత్తిడి మొత్తం భారత్ పడే ఉండేది. అందుకే మేము ఫ్రీగా ఆడేవాళ్ళం. కానీ ఆ మ్యాచ్ లో నన్ను కూర్చోబెట్టి మేము ఓడిపోతుంటే నేను చూడలేకపోయాను. అప్పుడు నేను చాలా వస్తువులను పగలగొట్టాను అని అక్తర్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేయగా.. పాకిస్థాన్ ఒక్క బంతి మిగిలి ఉండగానే 231 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది.

Advertisement

Visitors Are Also Reading