Ad
గుడ్డు పెట్టె కోడికే ఆ నొప్పి తెలుస్తుంది అనే విధంగా.. బ్యాట్ పట్టుకొని క్రీజులో ఉం ఆటగాడికే అక్కడ ఉన్న ఒత్తిడి అనేది తెలుస్తుంది అనేది నిజం. కానీ మాజీ ఆటగాళ్లు మాత్రం వారు కూడా ఒక్కపుడు అక్కడి నుంచే వచ్చాము అని విషయాన్ని మరిచిపోయి.. బాగా ఆడితే గొప్ప ఆటగాడు.. లేదంటే చేత ఆటగాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. పాక్ మాజీలు ఇందులో బాగా ఆరితేరారు అనేది నిజం.
గతంలో కోహ్లీ ఆడుతుంటే.. అతని కన్నా గొప్ప ఆడాడు లేరు అన్న పాక్ మాజీలే.. అతని విఫయం అవుతుంటే చెత్త ఆటగాడు అని అన్నారు. ఆ సమయం లో రాణిస్తున్న పాక్ కెప్టెన్ బాబర్ ను ఆకాశానికి ఎత్తేసారు. కానీ ఆసియా కప్ లో కోహ్లీ పరుగుల వరద పారించాడు. బాబర్ పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో ఒక్క టోర్నీతోనే బాబర్ ను విమర్శించి.. కోహ్లీని పొగడడం ప్రారంభించారు.
అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో పాక్ సొంత గడ్డపై టీ20 సిరీస్ లో ఆడుతుంది. ఇందులో జరిగిన రెండో మ్యాచ్ లో బాబర్ సెంచరీ చేసాడు. అంతే మళ్ళీ రెండు నాలుకలా మాదిరి బాబర్ ను పొగడడం ప్రారంభించారు. బాబర్ ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాడు అని.. బాబర్ క్లాస్ ముందు కోహ్లీ కూడా దిగ దుడుపే అని కామెంట్స్ చేసారు. అతనిలా షాట్స్ మరెవరు ఆడలేరు అని అంటున్నారు. ఒకవేళ తర్వాతి మ్యాచ్ లో బాబర్ విఫలం అయితే అంతే మళ్ళీ విమర్శలే అనేది ఫ్యాన్స్ కు బాగా తెలుసు.
ఇవి కూడా చదవండి :
రోహిత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ధోని..!
భువీపై రోహిత్ కు నమ్మకం లేదు.. అందుకే విఫలం..?
Advertisement