Home » టాలెంట్ ఉన్నా బ్యాడ్ లక్ వల్లే…షోలో భార్యను పట్టుకుని ఏడ్చేసిన శివారెడ్డి…!

టాలెంట్ ఉన్నా బ్యాడ్ లక్ వల్లే…షోలో భార్యను పట్టుకుని ఏడ్చేసిన శివారెడ్డి…!

by AJAY

టాలీవుడ్ లో మిమిక్రీ అంటే గుర్తుకు వచ్చే నటుడు శివారెడ్డి. మిమిక్రీ ఆర్టిస్టుగా శివారెడ్డి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ షోలలో మిమిక్రీ చేసి శివారెడ్డి ఆకట్టుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇలా ప్రతి ఒక్కరినీ అనుకరిస్తూ శివారెడ్డి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సీనియర్ నటులతో పాటు ప్రస్తుతం రాణిస్తున్న స్టార్ హీరోలను కూడా శివారెడ్డి అనుకరిస్తారు. ఇక శివా రెడ్డి 1994లో పిట్టలదొర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

మిమిక్రీ ఆర్టిస్ట్ గా శివారెడ్డి కి ఎంతో గుర్తింపు వచ్చింది. కానీ నటుడిగా ఇండస్ట్రీలో రాణించలేకపోయాడు. కొన్ని సినిమాలలో చేసినప్పటికీ ఆ సినిమాలు విజయం సాధించలేకపోయాయి. దాదాపు 100 సినిమాలకు పైగా నటించారు… కానీ ఒక్కటి కూడా శివారెడ్డికి నటుడిగా పేరు తెచ్చిపెట్టలేదు. కామెడి ఎంటర్ టైనర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సినిమా వెన్నెల లో వెన్నెల కిషోర్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్ కూడా మొదటగా శివారెడ్డికి వచ్చిందట.

Ismart jodi Shiva reddy

కానీ పాస్ పోర్ట్ లేని కారణంగా శివారెడ్డి విదేశాలకు షూటింగ్ కి వెళ్ళలేకపోయారు. ఇక ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శివారెడ్డి ఇస్మార్ట్ జోడీ అనే టీవీ షోలో తన బ్యాడ్ లక్ గురించి చెప్పి ఎడ్చేసాడు. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఇస్మార్ట్ జోడి టీవీ షో లో శివ రెడ్డి తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. ఓంకార్ వంట చేయాలి అంటూ ఒక టాస్క్ ఇచ్చాడు.

వంట చేస్తూ శివారెడ్డి భార్య ఓ ప్లాస్టిక్ కవర్ పై పాన్ పెట్టింది. దాంతో శివా రెడ్డి భార్య దాన్ని తీసే క్రమంలో చేతులు కాల్చుకుంది. ఆ తర్వాత శివారెడ్డి ఆమెను పట్టుకుని ఏడ్చేసాడు. తనకు ఎంతో టాలెంట్ ఉందని కానీ జీవితంలో వస్తున్న సమస్యల వల్ల సినిమాలు తనను వెనక్కి నెట్టేస్తున్నాయి అని చెప్పాడు.

Visitors Are Also Reading