అనిల్ రావిపూడి ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య కెరియర్ లో 108వ సినిమాగా తెరకెక్కుతున్న దీనికి ఇంకా టైటిల్ అంది పెట్టలేదు. ఈ మధ్యే ఈ సినిమా యొక్క అనౌన్సమెంట్ అనేది చేసారు. అయితే ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యారన్ నిర్మిస్తుంది.అయితే ఇది చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు అనే చెప్పాలి.
Advertisement
ఎందుకంటే అనిల్ రావిపూడి ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమాలో దిల్ రాజు ఉన్నాడు. మొదటి సినిమా పటాస్ కు డిస్టిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు బ్యానర్ లోనే తన తర్వాతి అన్ని సినిమాలు అనిల్ రావిపూడి తీసాడు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే 5 సినిమాలు వచ్చాయి. కాబట్టి అనిల్ ఇప్పుడు తీస్తున్న ఈ బాలయ్య సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తాడు అని అందరూ అనుకున్నారు.
Advertisement
కానీ షైన్ స్క్రీన్స్ వారు దీనిని నిర్మిస్తున్నారు అని తెలిసిన తర్వాత.. దిల్ రాజు ఎందుకు ఈ సినిమా తీయడం లేదు అనే చర్చ మొదలయ్యింది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ప్రచారం జరుగుతున్న విషయం ఏమిటంటే.. షైన్ స్క్రీన్స్ వారే తెలివిగా ఈ సినిమాను తీసుకొని దిల్ రాజుకు దక్కకుండా చేసారు అని తెలుస్తుంది. అనిల్ ఈ సినిమాను కూడా దిల్ రాజుతోనే తీయాలని భావించిన అది కుదరలేదు అని వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :