ప్రపంచకప్ తొలి మ్యాచ్ లో గెలిచి జోరు మీద ఉన్న టీమిండియా… ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా గెలిచింది. ఆఫ్ఘానిస్తాన్ జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇండియా. అయితే, . అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన ఓపెనర్ గిల్ నిన్నటి మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉండడం లేడు. వాస్తవానికి పాకిస్తాన్ తో జరిగే మూడో మ్యాచ్లో ఆడడం కూడా కష్టమే అని అంటున్నారు. గిల్ లేకపోవడంతో శిఖర్ ధావన్ పేరును తెరపైకి తీసుకువస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి గిల్ రాకతో దావన్ కు జట్టులో చోటు దక్కలేదు.
పైగా మనోడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ధావన్ కు ఐసీసీ టోర్నీలో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ సెలక్టరు గిల్ వైపే మొగ్గు చూపారు. ప్రపంచకప్ ముందు జరిగిన వెస్టిండీస్ సిరీస్ ఆసియాకప్ లో ధావన్ కు చోటు దక్కలేదు. దాంతో ప్రపంచకప్ లో అయినా దావన్ కు అవకాశం కల్పిస్తారేమోనని ఎదురు చూసినా అభిమానులకు నిరాశ ఎదురయింది. ధావన్ ను సెలెక్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ బీసీసీఐని ఓ రకంగా ట్రోల్ చేస్తున్నారు. ధావన్ విషయంలో బీసీసీఐ సానుభూతి చూపించిందని ఆరోపించారు. ఇప్పుడు గిల్ లేడు కాబట్టి ధావన్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నిజానికి ఐసీసీ టోర్నిని ధావన్ స్వర్గధామంలా భావిస్తాడు. సాధారణంగా ఐసీసీ టోర్నీలో బ్యాట్స్ మెన్స్ ఒత్తిడికి గురవుతారు. కానీ శిఖర్ ధావన్ రెట్టింపు ఉత్సాహంతో ఉంటాడు.
Advertisement
Advertisement
ఐసీసీ టోర్నీలు అంటే దావన్ కు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. 2004 అండర్-19 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే ప్రపంచకప్… ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఐసీసీ టోర్నీలో తన మార్పును చూపిస్తూ వచ్చాడు. ధావన్ ఓపెనర్ రోహిత్ శర్మకు జోడిగా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలను అందించాడు. తన అద్భుతమైన ప్రదర్శన వల్ల ఇండియా ఎన్నో మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. కానీ ఇప్పుడు టీమిండియా ప్రపంచకప్ లో బిజీగా ఉంటే గబ్బర్ ఇంట్లో కూర్చొని టీమిండియా మ్యాచ్లను ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ భావిస్తున్నట్టు దావన్ కు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది.
ఇవి కూడా చదవండి
- 16 ఏళ్లకే చనిపోతావని తెలిస్తే అలా చేసి ఉండేదాన్ని కాదు!.. మీరా మృతిపై విజయ్ భార్య ఎమోషనల్
- అమిత్ షాతో నారా లోకేష్ రహస్య మంతనాలు…బీజేపీలో టీడీపీ విలీనం కానుందా !?
- 3 ఏళ్లకు ఒకసారి పవన్ కళ్యాణ్ భార్యలను మారుస్తూ ఉంటాడు – జగన్