Home » తెలంగాణ అమ్మాయితో హీరో శర్వానంద్ పెళ్లి?

తెలంగాణ అమ్మాయితో హీరో శర్వానంద్ పెళ్లి?

by Bunty
Ad

టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. శర్వానంద్ పలు సూపర్ హిట్ సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన శర్వానంద్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శర్వానంద్ కెరీర్ లో గమ్యం, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆ తర్వాత మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

READ ALSO : SS రాజమౌళి అతిధి పాత్రలో కనిపించిన సినిమాలు

Advertisement

ఆపై కమర్షియల్ హీరోగా ఎదిగాడు. గత ఏడాది ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈయన ప్రజెంట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా, తాజాగా శర్వా పెళ్లికి ఓకే చెప్పేసాడని సమాచారం అందుతుంది. అంతేకాదు మ్యాచ్ కూడా ఫిక్స్ అయిందండోయ్. వధువు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. ఈ ఏడాది వేసవిలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

Advertisement

వధువు తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా తెలిసింది. ఆమె తాలూకా పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఇది లవ్ మ్యారేజ్ అనే మాట కూడా వినిపిస్తుంది. ఆ అమ్మాయికి షేర్వా కు చాలా కాలంగా తెలుసట. రెడ్డి సామాజిక వర్గం అమ్మాయితో శర్వా ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. పక్కా శర్వానంద్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు అని కూడా సమాచారం. ఆ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఉంటుందట. ఇక దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

READ ALSO : పవన్ కళ్యాణ్‌ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్

Visitors Are Also Reading