శర్వానంద్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో శర్వానంద్ హీరోగా నటించాడు. టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు.
Advertisement
పాత్ర ఏదైనా ఆ పాత్రకు శర్వానంద్ తగిన న్యాయం చేస్తూ ఉంటాడు. ఇక ఇటీవలి కాలంలో శర్వా కు సరైన హిట్ పడలేదు గానీ అప్పట్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో అభిమానులను మెప్పించాడు.
గమ్యం, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు శర్వా కు ఎంతో గుర్తింపు సంపాదించి పెట్టాయి. ఇదిలా ఉంటే శర్వా తాజాగా వివాహం చేసుకున్నాడు. టాలెంటెడ్ హీరో పెళ్లి రాజస్థాన్ వేదికగా జరిగింది. తన ప్రియురాలు అయిన రక్షిత రెడ్డి ని శర్వానంద్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు.
Advertisement
ఇక వీరి ఎంగేజ్ మెంట్ జనవరి 26 న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా జూన్ 2వ తేదీన హెల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఇక ప్రస్తుతం శర్వా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటో లలో కొత్త జంట బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక కొత్త జంట పై మీరు కూడా ఓ లుక్ వేయండి. మరో వైపు చాలా కాలం నుండి శర్వా కు కలిసి రావడం లేదు. చేసిన ప్రతి సినిమా నిరాశకే గురి చేస్తోంది. మరి పెళ్లి తరవత అయినా శర్వా కు కలిసి వచ్చి హిట్ లు పడటం షురూ అవుతుందో లేదో చూడాలి.
Also read:Mega star:బోలా మేనియా అంటూ “బోలా శంకర్” ఫస్ట్ సాంగ్ రిలీజ్..!