ఐపీఎల్ ఇప్పటివరకు 14 సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం 15వ నడుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఐపీఎల్ లో టైటిల్ అందుకొని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఒక్కటి. గత 14 సీజన్ లలో 2009, 2011 మరియు 2016 సీజన్లలో బెంగళూర్ జట్టు ఫైనల్స్ కు వెళ్ళింది. కానీ ఆ మూడు ఫైనల్స్ లో ఓడిపోయి రన్నరప్ గానే మిగిపోయింది. అయితే ఈ మూడు ఫైనల్స్ లో 2016 ఫైనల్స్ ను ఆ జట్టు అభిమానులు ఈపాటికి మరిచిపోరు అనే చెప్పాలి. కోహ్లీ కెప్టెన్సీలో 2016 ఐపీఎల్ ఫైనల్స్ కు వచ్చిన బెంగళూర్.. అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.
Advertisement
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ గురించి తాజాగా…ప్రస్తుతం ఢిల్లీ అసిస్టెంట్ కోచ్… అప్పటి రాయల్ ఛాలెంజర్స్ జట్టు సభ్యుడు అయిన షేన్ వాట్సన్ మాట్లాడుతూ… నేను ఎప్పుడైనా ఈ మ్యాచ్ చుసిన.. దీని గురించి విన్న నిను చాలా బాధపడుతాను. ఎందుకంటే.. ఈ మ్యాచ్ లో నేను ఆఖరో ఓవర్ వేసి ఉండకూడదు అని ఇప్పటికి అనుకుంటాను. అసలు ఆ రోజు టైటిల్ మా జట్టు గెలవాలి. నేను ఆ ఓవర్ వేయకపోతే అదే జరిగేది. అసలు ఈ మ్యాచ్ తర్వాత నా కెరియర్ అయిపోయింది అనుకున్నాను వాట్సన్ తెలిపాడు.
Advertisement
ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజన్ర్స్ జట్టు 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. వాట్సన్ వేసిన ఆఖరి ఓవర్ లో హైదరాబాద్ ఆల్ రౌండర్ బెన్ కట్టింగ్ మూడు సిక్సులు, ఒక్క ఫోర్ సహాయంతో 24 పరుగులు రాబట్టాడు. కానీ ఆ తర్వాత ఛేజింగ్ కు వచ్చిన బెంగళూర్ కు మంచి ఆరంభమే వచ్చింది. ఓపెనర్లుగా కోహ్లీ, గేల్ 112 పరుగుల భాగసౌమ్యం ఇచ్చారు. కానీ ఆ తర్వాత వికెట్లు వరుసగా పడటంతో 200 పరుగుల వద్దే ఆగిపోయింది. దాంతో 8 పరుగుల తేడాతో గెలిచిన సన్ రైజర్స్ మొదటి ఐపీఎల్ టైటిల్ అందుకోగా.. బెంగళూర్ కు మొదటి టైటిల్ మిస్ అయ్యింది.
ఇవి కూడా చదవండి :
హల్ ఆఫ్ ఫేమ్ ను ప్రారంభించిన బెంగళూర్.. మొదటిగా ఆ ఆటగాళ్లకు చోటు..!
బాలీవుడ్ లోకి ధావన్… షూటింగ్ కూడా పూర్తి…!