Home » బాలీవుడ్ లోకి ధావన్… షూటింగ్ కూడా పూర్తి…!

బాలీవుడ్ లోకి ధావన్… షూటింగ్ కూడా పూర్తి…!

by Azhar
Ad

భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి అందరికి తెలిసిందే. గ్రౌండ్ లో అయిన.. బయట అయిన.. సోషల్ మీడియాలో అయిన ఒకే విధంగా ఉంటాడు గబ్బర్. అయితే ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో తన కొడుకుతో కలిసి సోషల్ మీడియాలో ధావన్ చేసిన ఫన్.. అంత ఇంత కాదు. కానీ ఈ లాక్ డౌన్ ముగిసిన తర్వాత.. తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ వెంటనే భారత జట్టులో స్థానం కోల్పోయాడు. అందువల్ల కొంత డిప్రెషన్ లోకి వెళ్ళాడు.

Advertisement

అయితే ఇప్పుడు గబ్బర్ గురించి వస్తున్న తాజా సమాచారం ఏమిటంటే.. ధావన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఓ ప్రముఖ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో గబ్బర్ కనిపించనున్నాడట..! ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే ధావన్ చేసిన.. ఏం గెస్ట్ రోల్ కాదని… ఆ పాత్ర సినిమా మొత్తం ఉంటుంది అని సమాచారం. అయితే గతేడాది ​లో అక్షయ్​ కుమార్​, జాక్వెలిన్ నటిస్తున్న రామసేతు సినిమా షూటింగ్ ప్లేస్ లో గబ్బర్ కనిపించదు. కానీ ఈ సినిమాలో ధావన్ నటించలేదు అని తెలుస్తుంది.

Advertisement

అభిమానులు కూడా ధావన్ ఏ సినిమాలో నటించాడు అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు. కానీ మేకర్ మాత్రం దానిని చాలా జాగ్రత్తగా బయటపడకుండా చూసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న… ధావన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆ జట్టు తరపున అత్యాధికా పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు ధావన్. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ కూడా ధావన్ సెలక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

హల్ ఆఫ్ ఫేమ్‌ ను ప్రారంభించిన బెంగళూర్.. మొదటిగా ఆ ఆటగాళ్లకు చోటు..!

ఇంగ్లాండ్ పర్యటనకు రహానే దూరం..!

Visitors Are Also Reading