2019 లో ఇంటర్నేషనల్ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటినుండి అతను ఎప్పుడు.. ఐపీఎల్ కు వీడ్కోలు పులుకుతాడా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ధోనికీ ఐపీఎల్ 2021 చివరి సీజన్ అనుకున్న.. అతను ఐపీఎల్ 2022 లో చెన్నై జట్టు తరపున ఆడుతున్నాడు. దాంతో ఇదే అతనికి చివరి సీజన్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే జట్టు యాజమాన్యం సీజన్ ప్రారంభంలో తమ కెప్టెన్ గా జడేజాను నియమించింది.
Advertisement
అయితే ధోనిని కూడా ఈ మధ్యే ఇదే ప్రశ్న అడగగా అతను విచిత్రంగా స్పందించాడు. నేను వచ్చే ఏడాది కూడా చెన్నై జట్టుతోనే ఉంటా..! కానీ అది ఈ జెర్సీలోనా.. లేక వేరే జెర్సీలోనా అనేది మీకు అప్పుడే తెలుస్తుంది అని అన్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యల పై చెమ్మై మాజీ ఆటగాడు… ప్రస్తుత ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. ధోని మాటలను బట్టి నేను ఏం అనుకుంటున్నాను అంటే.. అతను వేరే ఎల్లో జెర్సీ అన్నాడు కాబట్టి.. ఆటగాడిగా కాకుండా జట్టు కోచింగ్ స్టాఫ్ లో భాగం అవుతాడు అని నేను అనుకుంటున్నాను.
Advertisement
ఎందుకంటే.. ధోని ఎట్టి పరిస్థితుల్లో చెన్నై జట్టును వదిలి పెట్టాడు. ఈ విషయం నేను అతనితో కలిసి ఆడినప్పుడు నాకు అర్ధం అయ్యింది. కాబట్టి ధోని ఆటగాకు వీడ్కోలు పలికిన.. జట్టు మెంటర్ గా లేదా డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తాడు. ఒకవేళ ధోని చెన్నై జట్టును వదిలేస్తే. నేను చాలా ఆశ్చర్యపోతా అని చెప్పాడు వాట్సన్. అయితే ఈ ఐపీఎల్ లో జడేజా న్యాయకత్వంలో చెన్నై రాణించకపోవడంహోం తిరిగి ధోనినే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు.
ఇవి కూడా చదవండి :
ధోని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..?
అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ పై కోచ్ కీలక వ్యాఖ్యలు..!