Home » షమీ ప్రపంచ కప్ జట్టులోకి రావాల్సిందే..?

షమీ ప్రపంచ కప్ జట్టులోకి రావాల్సిందే..?

by Azhar
Ad

ఆస్ట్రేలియా వేదిక వచ్చే నెల చివరి నుండి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే ఈ టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కానీ బీసీసీఐ ప్రకటించినా ఆ జట్టుపై చాలా విమర్శలు అయితే వచ్చాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ ను జట్టులో ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐని విమర్శించిన ఫ్యాన్స్.. సీనియర్ పేసర్ మొహ్మద్ షమీని స్టాండ్ బై ఆటగాడిగా ఉంచడం పై కూడా సీరియస్ అయ్యారు.

Advertisement

అయితే గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఆడిన షమీ… అప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క పొట్టి మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక అతడిని తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా అలాగే ఈరోజు ప్రారంభమైన సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ లకు బీసీసీఐ ఎంపిక చేసింది. కానీ కరోనా వల్ల ఇప్పుడు షమీ జట్టుకు దూరం అయ్యాడు. అయిన కూడా షమీని ప్రపంచ కప్ జట్టులోకి నేరుగా
తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

ఎందుకంటే ఇప్పుడు ఎంపిక చేసిన జట్టులో ఉన్న భువనేశ్వర్ కుమార్ అలాగే హర్షల్ పటేల్ ఇద్దరు కూడా దారుణంగా విఫలం అవుతున్నారు. అందుకే వారిలో ఎవరో ఒక్కరిని తప్పించి ప్రపంచ కప్ జట్టులో షమీని కలపాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ కరోనా నుండి కోలుకొని ఇంకా ఫిట్నెస్ సాధించని షమీని ప్రపంచ కప్ 15 మంది సభ్యులలో కలుపుతారా లేదా అనేది ప్రశ్నగా మారింది.

ఇవి కూడా చదవండి :

బాబర్ ను పడేసిన సూర్య కుమార్..!

హార్ధిక్ వంటి క్రికెటర్ పాక్ జట్టులో ఉన్నాడా..?

Visitors Are Also Reading