మోసం చేయాలంటే పరాయివాళ్లే అవసరం లేదు. కొన్ని సార్లు మన అనుకున్నవాళ్లే మోసం చేస్తారు. పరాయివాళ్లు మోసం చేస్తే భరించగలమేమోగానీ సొంతవాళ్లే మోసం చేస్తే ఆ బాధను తట్టుకోలేం.ఇక నటి షకీలాను కూడా తన అనుకున్నవాళ్లే దారుణం గా మోసం చేశారు. ఇప్పుడంటే షకీలా సినిమాలకు దూరంగా ఉంటున్నారు కానీ ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే.
Advertisement
వరుస సినిమాలతో షకీలా అప్పట్లో బిజీగా ఉండేవారు. ఆ సమయంలో కోట్లు సంపాదించారు. అయితే తన సంపాదన మొత్తం కుటుంబ సభ్యులే దోచేశారని ఓ ఇంటర్వ్యూలో షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ తాను సంపాదించిన రెండు కోట్ల రూపాయలను తన సోదరికి ఇచ్చానని చెప్పింది.
Advertisement
అయితే తరవాత మళ్లీ వెళ్లి డబ్బులు అడిగితే తాను వేరే వ్యక్తిని నమ్మి మోసపోయా అంటూ సమాధానం ఇచ్చిందని తెలిపింది. అంతే కాకుండా బయట వ్యక్తులు ఎవరైనా మోసం చేస్తే పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదు చేస్తాం అదే సొంతవాళ్లు మోసం చేస్తేం ఇంకా ఏం చేస్తామని కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు కోట్లు సంపాదించిన షకీలా జీవితం ప్రస్తుతం దీన స్థితిలో ఉంది. సొంత ఇల్లు కూడా లేకుండా షకీలా అద్దె ఇంట్లో జీవనం కొనసాగింస్తోంది. అంతే కాకుండా షకీలా పెళ్లి కూడా చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయిన సంగతి తెలిసిందే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించినప్పటికీ అతడు మోసం చేయడంతో షకీలా పెళ్లి జోలికి వెళ్లలేదు. ఓవైపు ఆర్థికంగా నష్టపోయి మరో వైపు కుటుంబం కూడా దూరం అవ్వడంతో షకీలా ఒంటరి జీవనాన్ని గడుపుతోంది.
ALSO READ :నరసింహనాయుడు లో మానస్ ఉన్నాడని మీకు తెలుసా… ఈ బుడ్డోడేనట…!