Home » రామ్ చరణ్ ని అవమానించిన షారూఖ్.. బయటపెట్టిన మేకప్ ఆర్టీస్ట్..!

రామ్ చరణ్ ని అవమానించిన షారూఖ్.. బయటపెట్టిన మేకప్ ఆర్టీస్ట్..!

by Anji
Published: Last Updated on

భారత కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ , రాధిక మర్చంట్ ల 3 రోజుల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశంలోని ప్రముఖులే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మంది హాజరయ్యారు. ఎంతో ఘనంగా జరిగిన వేడుకల్లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కు అవమానం జరిగిందని ఆయన మేకప్‌ ఆర్టిస్ట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో రామ్ చరణ్ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. అసలేం జరిగిందంటే… రామ్‌ చరణ్‌ మేకప్‌ ఆర్టిస్ట్ జెబా హాసన్‌   బాలీవుడ్‌ స్టార్‌ నటుడు షారూక్‌ ఖాన్ పై కోపాన్ని వ్యక్తం చేశాడు. అనంత్‌, రాధికా ప్రీ వెడ్డింగ్‌ బాష్‌ కు బాలీవుడ్ , సౌత్‌ సినిమా స్టార్స్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో బాలీవుడ్‌ నుంచి సల్మాన్ ఖాన్, షారూక్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, కలిసి స్టేజీ మీద అస్కార్‌ అవార్డు పాట నాటు నాటుకి స్టెప్పులు వేసేందుకు సిద్దం అయ్యారు. ఈ క్రమంలోనే షారూక్‌ చరణ్‌ ని స్టేజీ మీదకి పిలిచే సందర్భంలో ఇడ్లీ, వడ చరణ్‌ స్టేజీ మీదకు రావాలని అన్నాడు. దీంతో చరణ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ జెబా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జరిగిన విషయాన్ని రాసుకోచ్చారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న చరణ్ అభిమానులతో పాటు , తెలుగు సినీ అభిమానులు కూడా షారూక్‌ పై విమర్శలు చేస్తున్నారు. ఒక అభిమాని ఇలా రాశాడు, “షారుక్ ఖాన్ దక్షిణ భారత రామ్ చరణ్‌ను ఇడ్లీ అని పిలుస్తూ సౌత్‌ హీరోలను అవమానించడం జరిగింది. ఇది వారి అహంకారానికి నిదర్శనం.” అంటూ రాసుకొచ్చాడు.

Also Read : ఆ విషయంలో నాగార్జునతో అమలకు గొడవలు.. కారణం అదేనా ?

Visitors Are Also Reading